డీఆర్డిఓ : ఖాతాలో.. మరో విజయం..!

డీఆర్డిఓ(డిఫెన్సె రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్) ఎప్పటికప్పుడు భారత అమ్ములపొదిలోకి సరికొత్త సాంకేతికతను చేర్చడంలో తన కర్తవ్యం నిర్వహిస్తుంది. ఇవన్నీ దేశీయంగా రూపొందిస్తున్న ఆయుధాలు. వీటి గురించి ప్రపంచానికి కొద్దిపాటి వివరాలు మాత్రం చెపుతూ, మిగిలినవి ఆయా సందర్భాలలో ప్రదర్శించడం జరుగుతుంది. ఆ మాత్రం వ్యూహం యుద్ధ సమయంలో ఉండాల్సి ఉంది. అందుకే ఎక్కడ నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ, సొంతగా కూడా భారత్ తన ఆయుధాలను తాను తయారుచేసుకునే ప్రయత్నం డీఆర్డిఓ ద్వారా చేస్తూనే ఉంది. తద్వారా మన సాంకేతికత గోప్యంగా ఉంచబడుతుంది. అప్పుడు బయట వాళ్లకు మనవద్ద ఉన్నదానిపై అంచనాలు పెరుగుతూ పోవచ్చు. అప్పుడు వాళ్ళు యుద్దానికి సన్నాహాలు అంత తొందరగా చేయలేరు.
ఒకవేళ ఎంతసేపు బయట దేశాల నుండే ఆయుధాలు, ఇతర సామాగ్రి కొనుగోలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఇవే ఆయుధాలను మన శత్రు దేశాలకు కూడా అమ్మే అవకాశం ఉంటుంది. అలా జరిగిపోతుంది, కారణం, ఒకవేళ మనం రష్యా నుండి ఒక ఆయుధం కొన్నాం, అది సరికొత్తది, శత్రుదేశం కూడా దానిని కొంటె సరిపోతుంది. అప్పుడు యుద్దానికి సన్నాహాలు కూడా చేస్తుంది. ఇది సాధారణ పరిస్థితి, అదే మన సొంత సాంకేతికత కొంతైనా ఉంటె శత్రుదేశాలను కాస్త భయం ఉండే అవకాశాలు ఉంటాయి. దీనిపైనే చరిత్రలో ఒక సంఘటన ఉంటుంది. అప్పట్లో తనవద్ద తక్కువ సైన్యం ఉన్నప్పటికీ, ఒకరాజు రోజు లెక్కకు మించి అరిటాకులను బయట పడేయడం చేస్తూ ఉండేవారు. దానిని గమనించిన శత్రు దేశాలు అబ్బో వీళ్ళకి చాలా సైన్యం ఉన్నట్టుగానే ఉందే అని దానిపై దండయాత్ర ఆపేశారు. ఇది కూడా ఒక యుద్ధ వ్యూహమే.
అంటే అలా భారత్ బ్రాంతి కల్పించాల్సిన పనిలేదు కానీ, సొంతది అంటూ ఉంటె అది ఎంత ప్రభావాన్ని చూపుతుంది అనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అందులో మనం ఏఏ సాంకేతికత వాడింది వాళ్లకు తెలియదు కాబట్టి, వాళ్ళ ఊహలలో వాళ్ళు ఉంటారు. కాస్తోకూస్తో భయం కూడా వెంటాడుతూనే ఉంటుంది. అది సహజం. ప్రస్తుతం డీఆర్డిఓ కూడా మరో ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఫోఖ్రాన్ లో పలు ప్రయోగాలు జారుతూనే ఉన్నాయి. ఈ తాజా ఆయుధం 10 కిమీ దూరంలో ఉన్న లక్ష్యాలను నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఉన్న యాంటీ ట్యాంక్ ను విజయవంతంగా పరీక్షించింది డీఆర్డిఓ. ఎయిర్ ఫోర్స్ విమానం నుండి దీనిని పరీక్షించారు, దీని పరిదిలో పాక్ లో ఉన్న బ్యాంకర్లు లాంటివి పేల్చేందుకు, అలాగే ఆయా లక్ష్యాలను దూరం నుండే ధ్వంసం చేసేందుకు బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఇటీవల చెప్పుకున్నట్టుగా చైనా అటు పాక్ ఇటు ఆఫ్ఘన్ లలో స్థావరాల ద్వారా భారత్ పై విరుచుకుపడాలి అనుకుంటే ఆ సమయంలో ఈ ఆయుధం శత్రువులను ప్రతిఘటించడానికి ఉపయోగంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: