బుల్లి పిట్ట: బాదుడు మొదలు పెడుతున్న ఫోన్ పే సంస్థ.. ఎంత ఛార్జ్ అంటే..?

Divya
ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో నెంబర్ వన్ స్థానంలో భారతదేశం లో దూసుకుపోతున్న యాప్ ఫోన్ పే. ఇక మీదట వినియోగదారులు ఈ యాప్ ను వినియోగించుకోవాలంటే షాక్ తగిలేలా కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా ఉచితంగా సర్వీసులు అందించిన ఫోన్ పే సంస్థ ఇక మీదట యూజర్ చార్జీలను కూడా వసూలు చేస్తోంది అన్నట్లుగా సమాచారం.

ఇక ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి గ్యాస్ ,పెట్రోల్ వంటి ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ప్రైవేటు రంగంలో ఉండేటువంటి డిటిహెచ్ సంస్థలు కూడా వారికి అనుగుణంగానే రేట్లు పెంచుతున్నాం అన్నట్లుగా తెలియజేశాయి. ఇక వీరికి తోడుగా ఫోన్ పే కూడా వీరి లిస్టులో చేరింది. ఇన్ని సంవత్సరాలుగా ఫ్రీగా సర్వీసులు అందించి.. ఇప్పుడు ఒక్కసారిగా యూజర్ చార్జీలను వసూలు చేస్తామని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.

ఎన్ని సంవత్సరాల నుండి ఫోన్ పే నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేసుకున్న మనకి అన్నీ ఉచితంగానే లభించేవి. అయితే ఇటీవల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేయకుండా.. యూజర్ చార్జీలు ప్రవేశపెట్టే విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా మొబైల్ రీఛార్జి లపై యూజర్ ఛార్జీలను వసూలు చేస్తోంది అన్నట్లుగా తెలుస్తోంది.
మొబైల్ రీఛార్జి రూ.50 రూపాయలు చేస్తే.. గతంలో ఫ్రీగా అందించేది. కానీ ఇప్పుడు 50 నుంచి 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే.. ఒక రూపాయి చొప్పున సర్వీస్ ఛార్జ్ చేస్తోంది ఆన్నట్లుగా తెలుస్తోంది. వంద రూపాయలకు మించి ట్రాన్సాక్షన్ చేసుకున్నట్లయితే 2 రూపాయల చొప్పున యూజర్ చార్జ్ కింద వసూలు చేస్తోంది. అయితే ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా ఫోన్ పే సంస్థ వసూలు చేస్తోంది.
గత నెలలో ఫోన్ పే ద్వారా ఏకంగా 165 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా తెలిపింది. అయితే ఫోన్ పే ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ ట్రాన్సాక్షన్ సాయి తగ్గుతుందనే వార్తలు నెటిజన్ల నుండి వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: