బుల్లి పిట్ట: జియో సరికొత్త ఆఫర్ లు ఇవే..!

Divya
జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇక జియో తోపాటు ఎయిర్టెల్ అలాగే వోడాఫోన్ ఐడియాలు కూడా కస్టమర్లకు మరింత చేరువ అవ్వడానికి, రీఛార్జ్ విషయంలో అతి జాగ్రత్తలు పాటించడంతో పాటు ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆఫర్లను కస్టమర్ల కోసం వదులుతున్నారు. ఇప్పుడు కూడా సరికొత్త ప్లాన్ లను అందుబాటులోకి తీసుకు రావడం గమనార్హం. ఒక్కసారి గనుక మీరు ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసినట్లయితే సంవత్సరం పాటు ఎంజాయ్ చేయవచ్చని ,అది కూడా అన్లిమిటెడ్ కాలింగ్ ,ఎస్ఎంఎస్ లతో పాటు డైలీ డేటా కూడా లభిస్తుంది అని ఈ టెలికాం దిగ్గజ సంస్థలు తెలుపుతున్నాయి.
ఎయిర్టెల్ రూ.1498 ప్లాన్ :
ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ ను  సంవత్సరానికి ఒకసారి వేయించుకున్నట్లయితే 24gb డేటా పొందడంతోపాటు, 365 రోజులపాటు ఉచితంగా వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. మీకు 24gb హై స్పీడ్ డేటా అయిపోయినట్లు అయితే ప్రతిరోజు 64kbps వేగంతో మొబైల్ లో డేటా ను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా 3600 ఎస్ఎంఎస్లను ఏడాదిపాటు పంపించుకునే వెసులుబాటును కూడా ఎయిర్టెల్ కల్పించింది. వివిధ రకాల యాప్ లను కూడా ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందే ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది.
జియో రూ.1299 ప్లాన్:
Jio మిగతా టెలికామ్ దిగ్గజం సంస్థల కంటే కొంచెం తక్కువ ధరలకే కస్టమర్లకు రీచార్జ్ చేసుకునే వెసులుబాటును కలిగిస్తుంది. ఇప్పుడు ఈ ప్లాన్ మొత్తంతో ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేసుకున్నట్లయితే, 24gb డేటా లభించడంతోపాటు 336 రోజులు వాయిస్ కాలింగ్ పొందవచ్చు. 64 kbps వేగంతో మొబైల్ డేటాను ఉపయోగించడమే కాకుండా, 336 రోజులపాటు ఉచితంగా వాయిస్ కాలింగ్ పొందవచ్చు. 3600 ఎస్ఎంఎస్ లు  కూడా సంవత్సరం పొడవునా పంపించే వెసులుబాటు ఉంటుంది.
వొడాఫోన్ ఐడియా రూ.1499 ప్లాన్ :
ఇక వొడాఫోన్ ఐడియా కూడా ఈ మొత్తంతో రీఛార్జ్ చేసుకున్నట్లయితే , 365 రోజుల వాయిస్ అపరిమిత కాలింగ్ తో పాటు 24 జీబీ డేటాను కూడా అందిస్తుంది. సంవత్సరం పొడవునా 3,600  ఎస్ఎంఎస్ లను పంపించవచ్చు. వి మూవీస్ ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: