బుల్లిపిట్ట: మీ మొబైల్ లో ఐపీఎల్ చూస్తున్నారా..! అయితే మీకోసమే.. ప్రతిరోజు 3gb డేటా..!

Divya

ఐపీఎల్ సందడి మొదలైంది. క్రికెట్ ప్రియులకు ఇది ఒక ఆనంద పరిచే విషయం లాంటిది. అయితే మీరు ఐపీఎల్ మ్యాచ్ ను స్మార్ట్ ఫోన్ లో చూస్తున్నారా. అయితే మీకు డేటా ఉన్న ప్లాన్స్ అవసరం. అందుకే మీ కోసం త్రీ జీబీ డేటా ప్లాన్స్ రిలయన్స్ జియో, ఎయిర్టెల్,వోడాఫోన్, ఐడియా_vi రోజుకి 3జీబీ డేటాతో వేర్వేరు ప్లాన్లు అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే రోజంతా 3జీబీ డేటాను పొందవచ్చు. అయితే ఇవి ప్లాన్స్ పై ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తున్నాయో తెలుసుకుందాం.
1).జియో రూ.349 ప్లాన్: ఈ ప్లాన్ రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. అంటే మొత్తం 84 జీబీ డేటాను వాడుకోవచ్చు. వాయిస్ కాల్స్ ఉచితం. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. జియో యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
2).జియో రూ.401 ప్లాన్: ఈ ప్లాన్ రోజుకి 3 జీబీ డేటాను లభిస్తోంది. వ్యాలిడిటీ 28 రోజులు. అలాగే అదనంగా మరో 6 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 90 జీబీ డేటా లభిస్తుంది. వీటితోపాటు డిస్నీ + హాట్ స్టార్ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
3).ఎయిర్టెల్ రూ.398 ప్లాన్: ఈ ప్లాన్ తో రోజుకి 3జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 28 రోజులు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకి 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ తోపాటు వింక్ మ్యూజిక్,అకాడమీ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి. హలో ట్యూన్ కూడా ఉచితంగానే లభిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కూడా రూ.100 క్యాష్బ్యాక్ లభిస్తుంది.
4). ఎయిర్టెల్ రూ.448: ఎయిర్టెల్ ప్లాన్ రోజు 3జీబీ డేటా వాడుకోవచ్చు. వాలిడిటీ 28 రోజులు. అన్లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. డిస్నీ+ హాట్ స్టార్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది.
5). వోడాఫోన్  రూ.401 ప్లాన్: ఈ ప్లాన్ తో రోజుకు 3జీబీ డేటా లభిస్తోంది. 28 రోజులు మాత్రమే కాకుండా అదనంగా మరో 16 జీబీ డేటాను వాడుకోవచ్చు. డిస్నీ +హాట్స్టార్ కూడా ఉచితంగా లభిస్తుంది.
6). వోడాఫోన్  రూ.601: వోడాఫోన్ ఈ ప్లాన్ ను రోజుకు 3 జీబీ డేటా తో లభిస్తుంది. వ్యాలిడిటీ 56 రోజులు. అదనంగా 32 జీబీ డేటాను వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు, డిస్నీ+హాట్స్టార్ కూడా ఒక సంవత్సరం పాటు ఉచితంగానే లభిస్తుంది. అంతేకాకుండా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డేటా ఉచితంగా వాడుకోవచ్చు.
7). వోడాఫోన్  రూ .801: వొడాఫోన్ ఈ ప్లాన్ ను ప్రతి రోజూ 3 జీబీ డేటా తో లభిస్తుంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు  అదనంగా 48 జీబీ డేటాను లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. డిస్నీ+హాట్ స్టార్  ఒక సంవత్సరం పాటు ఉచితంగా చూడవచ్చు. హై స్పీడ్ నైట్ టైం ఇంటర్నెట్, వీకెండ్ డేటా రోల్ ఓపెన్ బెనిఫిట్, వి ఐ మూవీస్, టీవీ యాక్సెస్ కూడా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: