బుల్లిపిట్ట: ప్రత్యేకమైన ఆఫర్లను ప్రారంభించిన వొడాఫోన్ ఐడియా.... వివరాలు ఇవే...!

Suma Kallamadi
ఇండియాలోని టెలికాం సంస్థలు వొడాఫోన్ ఐడియా VI కొత్త బ్రాండ్ గా రూపొందించిన  సంగతి తెలిసినదే. అయితే ఇలా రూపొందించిన తరువాత పలు మార్పులని చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా Vi కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను ప్రారంభించింది దీనికి గల కారణం  యూజర్ల బేస్ తగ్గుతున్న క్రమంలో అరికట్టడానికి మాత్రమే. ఇందులో భాగంగా సరసమైన ధరల వద్దనే కొన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్ లను కూడా అందిస్తున్నది. మరి వివరాలు ఇక్కడ ఉన్నాయి పూర్తిగా చూసేయండి.
Vi రూ.699 RDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు ఇవే....  వొడాఫోన్ ఐడియా (Vi) సంస్థ తన వినియోగదారుల కోసం మంచి పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటంటే.....? రూ.699 ధర వద్ద లభించే RDX ప్లాన్. దీనిని Vi ఎంటర్టైన్మెంట్ ప్లస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. అపరిమిత డేటా ఈ ప్లాన్ ద్వారా పొందొచ్చు. ఇది భారతదేశం లోని ఏ నెట్‌వర్క్‌కైనా యూజర్ ఫ్రీ వాయిస్ కాలింగ్, రోజుకు 100SMS‌లు, రూ.999 విలువైన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, Vi మూవీస్, టివి సబ్‌స్క్రిప్షన్, జోమాటో ఫుడ్ ఆర్డర్‌ల పై రూ.200 వరకు, రూ.125 MPL క్యాష్‌ను అందిస్తుంది. చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో...!
వోడాఫోన్ అందిస్తున్న  ప్రీపెయిడ్ ప్లాన్‌ల పూర్తి వివరాలపై కూడా ఇప్పుడే ఒక లుక్ వేసేయండి. వివరాల్లోకి వెళితే.......  రూ.109 మరియు రూ.169 ప్లాన్‌ల మధ్య రెండు రూ.129, రూ.149 ప్రీపెయిడ్ ప్యాక్‌లను తన వినియోగదారులకు అందిస్తున్నది. ఇది ఇలా ఉండగా రూ.149 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు తో రూ.129 రీఛార్జి ప్లాన్ అందించే అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అదే రూ.129 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ లోకి వస్తే....  24 రోజుల వాలిడిటీతో 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 SMS ప్రయోజనాలను అందిస్తుంది. రూ.129 మరియు రూ .149 ప్లాన్‌లు రెండూ వోడాఫోన్ ప్లే మరియు Zee5 వంటి OTT యాప్‌లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి. ఇది ఇలా ఉంటె  రూ .109 మరియు 169 ప్లాన్‌లకు కూడా ఓటీటీ ప్రయోజనాన్ని అందించవచ్చు అని చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: