టి20 WC : గేల్ సాధించిన రికార్డ్.. ఇంకా పదిలమే?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఈసారి ప్రపంచకప్ టోర్నికి ఆతిథ్యం ఇస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే క్రికెట్ ను మరింతగా ప్రపంచ దేశాలలో విస్తరించాలి అనే ఉద్దేశంతో ఐసీసీ క్రికెట్ కి పెద్దగా ఆదరణ లేని అమెరికాలో.. ఇక వరల్డ్ కప్ టోర్ని నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ ప్రపంచకప్ టోర్నీలో 20 టీమ్స్ పాల్గొనబోతున్నాయి. ఇక ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా అమెరికా చేరుకొని ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నాయి. కొన్ని టీమ్స్ వార్మప్ మ్యాచులు ఆడుతూ ఉండడం గమనార్హం.

 అయితే t20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణ ద్వైపాక్షిక సిరీస్ లు జరిగితేనే ఆటగాళ్లు వీరబాదుడు బాదుతూ ఉంటారు. అలాంటిది వరల్డ్ కప్ లాంటి టోర్నీలో ఇక బ్యాటింగ్ విధ్వంసం ఎలా కొనసాగుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే రేపటి నుంచి టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపద్యంలో.. టి20 ఫార్మాట్లో జరిగిన ఐసీసీ టోర్ని లలో ఇప్పటివరకు చెరిగిపోని రికార్డులు సృష్టించిన ఆటగాళ్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా సిక్సర్లకు మారుపేరుగా చెప్పుకునే పొట్టి ఫార్మాట్లో అత్యధిక సిక్సర్ల రికార్డు ఎవరిది అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

 వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ క్రిస్ గేల్ పైనే ఈ రికార్డు ఉందట. టి20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు( 63) గేల్ బాదేశాడు. ఈ లిస్టులో అతని తర్వాత స్థానంలో రోహిత్ శర్మ 35 సిక్సర్లతో  ఉన్నాడు. ఇక ఆ తర్వాత  బట్లర్ 33, యువరాజ్ సింగ్ 33, డేవిడ్ వార్నర్ 31, షైన్ వాట్సన్ 31, ఏబి డివిలియర్స్ 30, విరాట్ కోహ్లీ 28 సిక్సర్లతో  ఉన్నారు. టి20 వరల్డ్ కప్ లో అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు.. రోహిత్ శర్మ 39 పేరిట ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షాకీబ్ అల్ హసన్ (36) రెండో స్థానంలో ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: