నా బౌలింగ్ వేగం వెనుక.. అసలు సీక్రెట్ అదే : మయాంక్

praveen
ఇటీవల కాలంలో ఇండియన్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయిన క్రికెటర్ ఎవరు అంటే మయాంక్ అగర్వాల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతూ ఫ్యూచర్ స్టార్స్ తామే అన్న విషయాన్ని అందరికీ అర్థం అయ్యేలా చేస్తున్నారు. అయితే ఇలా మొదటిసారి ఐపీఎల్ ఆడుతున్న మయాంక్ యాదవ్ అదరగొట్టేస్తున్నాడు. ఏకంగా తన ఫాస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్ధులను భయపెట్టేస్తున్నాడు.

 ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో కేవలం కొంతమంది బౌలర్లకు మాత్రమే సాధ్యమైనా 155 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులను  విసురుతూ ఇక ప్రస్తుతం ఇండియన్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు మయాంక్ యాదవ్. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా లక్నో జట్టు విజయాలలో కీలకపాత్ర వహిస్తున్నాడు. ఇక ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో సైతం ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక ప్రత్యర్థిని దెబ్బ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే మీడియా సమావేశంలో పాల్గొన్న ఈ యువ సంచలనం.. అంతర్జాతీయ క్రికెట్ లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు. వేగంగా బౌలింగ్ చేయడానికి డైట్, సరిపడా శిక్షణ అవసరం. త్వరగా రికవరీ కావడానికి చన్నీటి స్నానం, డైట్ పై ఫోకస్ చేస్తూ ఉన్నాను అంటూ మయాంక్ యాదవ్ తెలిపాడు. అయితే ఇటీవలే ఆర్సిబి తో జరిగిన మ్యాచ్లో ఒక రకంగా బంతులతో నిప్పులు చిరిగాడు ఈ యువ ఆటగాడు. నాలుగో ఓవర్లు వేసి కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చిన మయాంక్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: