బిసిసిఐ షాకింగ్ నిర్ణయం.. పురుషుల క్రికెట్లో మహిళ ఎంపైర్లు?

praveen
గత కొంత కాలం నుంచి బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే . ముఖ్యం గా బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎంపికైన తర్వాత ఇప్పటివరకు కొన్ని అనూహ్యమైన  నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పాలి. మొన్నటి వరకు భారత క్రికెట్ లో పురుష క్రికెటర్లతో పోల్చి వస్తే అటు మహిళా క్రికెటర్లకు చెల్లించే వేతనాలు చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఉండేవి అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో మాత్రం పురుషులతో సమానంగానే మహిళలకు కూడా మ్యాచ్ ఫీజు తీసుకునేలా నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

 ప్రపంచ క్రికెట్లో ఇక బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఎంతో సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇలా అంతర్జాతీయ క్రికెట్లో మహిళల ప్రాముఖ్యతను పెంచే విధంగా ఇక మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు ముందు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే సంచలన నిర్ణయానికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది.  ఇప్పటికే పురుషుల క్రికెట్లో మహిళ కామెంటెటర్లను  తీసుకువస్తూ నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్లో మహిళ అంపైర్లకు  కూడా అవకాశం కల్పించబోతున్నారు అన్నది తెలుస్తుంది.

 పురుషుల క్రికెట్లో మహిళల భాగస్వామ్యం పెంచేందుకే బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.  త్వరలో ప్రారంభం కాబోతున్న రంజీ ట్రోఫీలో ఉమన్ ఎంపైర్లు  మైదానంలో కనిపించబోతున్నారట. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలియజేశారు. రానున్న రోజులలో అంతర్జాతీయ క్రికెట్లోనూ ఇక మహిళ ఎంపైర్లు  కనిపించే అవకాశం ఉందని బిసిసిఐ అధికారి చెప్పుకొచ్చారు.  కాగా భారత క్రికెట్లో వృందారతి, గాయత్రి, జనని మహిళ అంపైర్లు గా ఉన్నారు. 
దీంతో ఇన్నాళ్లపాటు కేవలం పురుషుల మెయిల్ ఎంపైర్స్ ని మాత్రమే అందరూ చూశారు ఇక ఇప్పటినుంచి ఫిమేల్ ఎంపైర్స్ కూడా సందడి చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: