టీమిండియా తరఫున 14 ఏళ్లు పూర్తి.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్.. అభిమానులకు పరుగుల యంత్రం.. రికార్డులకు రారాజు.. ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నం.. ప్రత్యర్థి ఓటమిని శాసించే టీమిండియా బలం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎంతైనా చెప్పవచ్చు.  ఇంతకీ ఆయన ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది అదేనండి మన అందరికీ తెలిసిన మనందరి ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లి. అయితే విరాట్ కోహ్లీ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అంటారా.. సరిగ్గా ఇదే రోజు 14 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు విరాట్ కోహ్లీ.  టీమిండియా తరఫున మొదటి మ్యాచ్ ఆడాడు.

 అందుకే ఈ 14 ఏళ్ల కెరీర్లో విరాట్ కోహ్లీ భారత జట్టుకు చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అంతేకాదు 14 ఏళ్ల క్రితం ఇదే రోజున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్ట.. నాకు అరుదైన గౌరవం దక్కింది అంటూ ఒక క్యాప్షన్ జత చేశాడు. 2008 ఆగస్టు 18వ తేదీన డాంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా కోహ్లీ టీమ్ ఇండియా జట్టు లోకి అరంగేట్రం చేసాడు. తొలి మ్యాచ్లోనే తన బ్యాటింగ్ లో డీలా పడిపోయాడు. ఒక ఇరవై రెండు బంతులు ఆడి 12 పరుగులు మాత్రమే చేశాడు.

 అతడు బాగా రాణించక పోయినా టీమిండియా ఘన విజయం సాధించింది ఇ. క ఆ తర్వాత కాలంలో మాత్రం ఇంతింతై వటుడింతై అన్న తరహాలో అనతికాలంలోనే టీమిండియాలో కీలక బ్యాట్స్మెన్గా అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అయితే కొన్నేళ్ళ పాటు అన్ని ఫార్మాట్లలో కూడా ఒక్క మ్యాచ్ మిస్ అవ్వకుండా ఆడాడు అంటే కోహ్లీ మానసిక శారీరక దృఢత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అందరూ లక్ష్యఛేదనలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం టార్గెట్ చేదించడం లోనే మరింత దూకుడుగా ఆడుతూ ఉంటాడు.

 ఇప్పటి వరకూ తన కెరీర్లో 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఇక ఎన్నో హాఫ్ సెంచరీలు చేశాడు. కాగా 14 ఏళ్ల కెరీర్లో విరాట్ కోహ్లి 102 టెస్టులలో 8074 పరుగులు చేశాడు. ఇక 262 వన్డేలలో 12344 పరుగులు చేశాడు. 99 టీ 20 లలో 3308 పరుగులు చేశాడు అని చెప్పాలి. టెస్ట్ లలో 27 సెంచరీ వన్డే లలో 43 సెంచరీలు టీ20 లలో  30 సెంచరీలు సాధించాడు విరాట్ కోహ్లీ. ఇటీవల విరాట్ కోహ్లీ చేసిన వీడియో లో 14 ఏళ్ళ కెరియర్ గురించి ఉంది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కోహ్లీ కోహ్లీ రికార్డు లను గుర్తు చేసుకుంటున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: