జింబాబ్వే పర్యటన.. కోచ్ మార్చేసిన బీసీసీఐ?

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియా వరుస పర్యటనలతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. వివిధ దేశాలకు పర్యటనలకు వెళ్తూ అక్కడ ఆదిత్య  జట్లపై వరుసగా విజయాలు సాధిస్తూ ఆధిపత్యం చెలాయిస్తుంది.  ఈ క్రమంలోనే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో కూడా ఇదే జోరును కొనసాగించింది అన్న విషయం తెలిసిందే. మొదట వన్డే సిరీస్లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి 3-0 క్లీన్స్వీప్ చేసింది. టి20 సిరీస్ కూడా నాలుగు మ్యాచ్లలో విజయం సాధించి సత్తా చాటింది.

 అయితే మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఆసియా కప్ నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి  ఇవ్వకుండా దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైంది టీమిండియా. ఈ క్రమంలోనే అక్కడ వన్డే సిరీస్ ఆడబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే జింబాబ్వే పర్యటనకు వెళ్లిపోయే జట్టును ఇప్పటికే ప్రకటించింది. కాగా ఇక ఈ పర్యటనలో భాగంగా ఎంతోమంది సీనియర్లకు విశ్రాంతిని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టు కోచ్ ని కూడా మారుస్తున్నట్లు ఇటీవల బీసీసీఐ ప్రకటించింది.

 ప్రస్తుతం జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ కాకుండా జాతీయ క్రికెట్ అకాడమీ అధినేతగా ఉన్న వివియస్ లక్ష్మణ్ కు మరో సారి కోచింగ్ బాధ్యతలను అప్పగించింది బిసిసీఐ. ఈనెల 18, 20, 22 తేదీలలో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది భారత జట్టు. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జైసా ధ్రువీకరించారు. అయితే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ విశ్రాంతి తీసుకోవటం లేదని.. నెలాఖరులో మొదలయ్యే ఆసియా కప్  కోసం ముందుగానే యూఏఈ చేరుకోవాల్సి ఉంది అంటూ వివరణ ఇచ్చారు. అయితే ఆసియా కప్ లో సెలెక్ట్ అయిన కె.ఎల్.రాహుల్, దీపక్ హుడా మాత్రమే జింబాబ్వేకు వెళ్తు ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: