బాబర్ అజాం బతికిపోయాడు.. అలా జరిగుంటేనా?

praveen
ఇటీవలి కాలంలో అటు భారత జట్టులో కీలక బ్యాట్స్మెన్ గా ఎదుగుతున్న సూర్యకుమార్ యాదవ్.. ఇటీవలి కాలంలో టీ20 లో అదిరిపోయే టైటిల్ తో ఆకట్టుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా ఒక్కసారిగా అగ్ర స్థానం లోకి దూసుకు వచ్చాడు. ఏకంగా టి-20లో అత్యుత్తమ బ్యాట్స్మన్గా జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతూ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న బాబర్ అజాం రికార్డుకు ఎసరు పెట్టేలా కనిపించాడు సూర్యకుమార్ యాదవ్.

 ఇక సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్ లో బాగా రాణించాడు అంటే టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్వన్ స్థానంలో కి రావడం ఖాయం అని అందరూ భావించారు. ఇకపోతే ఇటీవల ఐసీసీ బ్యాట్స్మెన్ కు సంబంధించి టి20 ర్యాంకింగ్స్  విడుదల చేసింది. అయితే ఇక ఈసారి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం బతికిపోయాడు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే రెండో స్థానం లోకి దూసుకు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మొదటి స్థానం లోకి వస్తాడు అని అనుకున్నప్పటికీ మరోసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వెస్టిండీస్ టి20 సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్కు సూర్యకుమార్ యాదవ్ కు విశ్రాంతి ఇవ్వడం బాబర్ కి కలిసి వచ్చింది అని చెప్పాలి.

 ఒకవేళ వెస్టిండీస్తో జరిగిన చివరి టి20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ కి అవకాశం వుంటే అతను మంచి ఇన్నింగ్స్ ఆడే వాడు. తద్వారా ఇక పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ను వెనక్కి నెట్టి టీ20 లో బెస్ట్ బ్యాట్స్ మెన్ గా నెంబర్ వన్ స్థానం దక్కించుకునే అవకాశం ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక ఇదే లిస్టులో అటు 66వ స్థానం నుంచి రిషబ్ పంత్ 59కి  చేరుకోవడం గమనార్హం. ఇక ఈ లిస్టులో టాప్ టెన్ లో భారత్ నుంచి చోటు దక్కించుకున్న వారు తక్కువ మందే ఉన్నారు అని చెప్పాలి. ఇక ఫాస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో భువనేశ్వర్ కుమార్ 9వ ర్యాంకుకు దిగజారి పోయాడు. ఈ లిస్టులో స్టార్ ఫేసర్ జోస్ హాజీల్ వుడ్ ఏకంగా 792 అగ్రస్థానంలో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: