స్టన్నింగ్ క్యాచ్.. అదిరే రనౌట్.. వైరల్ వీడియో?

praveen
ఇటీవలి కాలంలో పురుషుల క్రికెట్ కి తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు మహిళా క్రికెటర్లు. ఏకంగా రికార్డులలో కూడా పురుషుల క్రికెట్ తో పోటీ పడుతూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో మహిళల క్రికెట్ ను కూడా ఎంతో మంది ప్రేక్షకులు ఆదరిస్తూ ఉండటం గమనార్హం. అయితే కేవలం రికార్డులు కొల్లగొట్టడం లోనే కాదు మెరుపు ఫీల్డింగ్  చేయడంలో కూడా అదరగొడుతు ఉండడం గమనార్హం.  సాధారణంగా సూపర్ మాన్ లా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టడం పురుషుల క్రికెట్ లో  మాత్రమే చూడవచ్చు అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు.. ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే మాత్రం అలా అనుకోవడం తప్పే అంటూ భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇటీవల ఒక భారత మహిళా క్రికెటర్ గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ పట్టింది.

 అద్భుతమైన క్యాచ్ మాత్రమే కాదండోయ్ అదిరిపోయే రన్ ఔట్ తో జట్టుకు ఎంతో మేలు చేసింది మరో ప్లేయర్. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలు కూడా ట్విట్టర్ వేదికగా తెగ హల్చల్ చేస్తున్నాయి అని చెప్పాలి. ఇటీవలే కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా గోల్డ్ మెడల్ కోసం భారత్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసింది ఆస్ట్రేలియా. 11 ఓవర్లలో రాధా యాదవ్ బౌలింగ్ చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా మెరుపువేగంతో బంతిని వికెట్లకు వేసింది రాధా యాదవ్. దీంతో ఆస్ట్రేలియా  బ్యాటర్ రనౌట్  గా పెవిలియన్ చేరాల్సిన  పరిస్థితి ఏర్పడింది.


 ఆ తర్వాత 12 ఓవర్ దీప్తి శర్మ వేసింది. ఆ సమయంలోనే కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించగా స్టన్నింగ్ క్యాచ్ పట్టుకోవడంతో మరో ఆస్ట్రేలియా బ్యాటర్ చివరికి వెనుతిరిగింది.. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలు కూడా ట్విట్టర్ లో తెగ చక్కెర్లు కొడుతున్నాయి అని చెప్పాలి.  ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. కాగా ఫైనల్ మ్యాచ్ లో భాగంగా చివరి వరకు ఎంతో వీరోచితంగా పోరాడిన టీమిండియా జట్టు 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే ఇక గోల్డ్మెడల్ మిస్ చేసుకొని రజతం తో సరిపెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: