మళ్ళీ ఆస్ట్రేలియా చేతిలోనే.. భారత్ కు దెబ్బ మీద దెబ్బ?

praveen
ప్రస్తుతం 2022 కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా భారత క్రీడాకారులు ఎంతో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎప్పుడూ లేనంతగా ఈసారి ఎంతో మంది క్రీడాకారులు ఇప్పటికే గోల్డ్మెడల్ కూడా సాధించి త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడేలా చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు మాత్రం టీమిండియాకు అడుగడుగునా ఆశలకు గండి కొడుతుంది అన్నది తెలుస్తుంది. దాదాపు ఇరవై నాలుగేళ్ల తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో అర్హత సాధించింది క్రికెట్. ఈ క్రమంలోనే టి20 సిరీస్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ టి 20 టోర్నీలో భాగంగా గ్రూప్ ఏ లో ఉన్న భారత జట్టు గ్రూప్ బి లో ఉన్న ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా రాణించి ఫైనల్లో అడుగుపెట్టాయి.

 ఇలాంటి సమయంలోనే ఫైనల్లో ఏ జట్టు తెలుస్తుంది అన్నది  ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ పోరులో చివరికి ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. 9 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఓటమి తప్పలేదు అనే చెప్పాలి. ఇలా మొదటి సారి కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి  సత్తా చాటుతోంది అనుకున్న టీమిండియాకు ఆస్ట్రేలియా ఊహించని దెబ్బ కొట్టింది. ఇక ఇప్పుడు మరో సారి పురుషుల హాకీ పోటీలలో కూడా ఆస్ట్రేలియా మరోసారి భారత్ ను దెబ్బతీసింది అన్నది తెలుస్తుంది. ఇటీవల జరిగిన హాకీ ఫైనల్ మ్యాచ్లో 0-7 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది భారత జట్టు.

 ఫలితంగా రన్నరప్గా నిలిచిన భారత జట్టు రజత పతకం తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదటి నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఆస్ట్రేలియా జట్టు. ఎక్కువసేపు బంతిని తమ ఆధీనంలో ఉంచుకుంటు వరుసగా గోల్స్ చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలోనే భారత్ ఒక్క గోల్ కూడా చేయలేక పోయింది అని చెప్పాలి. అంటే ఏ దశలో ఆస్ట్రేలియాకు పోటీ ఇవ్వలేకపోయింది. అయితే మొన్నటికి మొన్న అటు మహిళల హాకీ జట్టు సైతం ఆస్ట్రేలియా చేతిలోని ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. కాగా ఆస్ట్రేలియా జట్టు అడుగడుగున టీమిండియాకు ఎదురుదెబ్బలు కొడుతూనే ఉంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: