ఆసియా కప్ జట్టు ఇదేనట.. శ్రేయస్, జడేజా ఔట్?

praveen
సాధారణంగా సినిమా విడుదలయ్యే ముందు ట్రైలర్ను విడుదల చేస్తూ ఉంటారు. ఆ ట్రైలర్ లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ ని బట్టి ఇక సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఒక అంచనాకి వస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలాగే ఆస్ట్రేలియా వేదికగా మరో మూడు నెలల్లో జరగబోయే టి20 వరల్డ్ కప్ కి ముందు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే ట్రైలర్ లాగానే ప్రస్తుతం ఆసియాకప్ జరగబోతుంది. యూఏఈ వేదికగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మినీ ప్రపంచకప్లో తలపడేందుకు ప్రస్తుతం ఆసియా లోని అన్ని జట్లు కూడా సిద్ధమైపోయాయ్.

 ఇప్పటికే ఆసియా కప్ లో పాల్గొనబోయే జట్టు వివరాలను అన్ని దేశాలు ప్రకటించాయి. కానీ బీసీసీఐ మాత్రం ఈ విషయంపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 8వ తేదీన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెలక్టర్లు కమిటీ ప్రకటించే అవకాశం ఉన్నది అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత జట్టు లో కొనసాగుతున్న కొంత మంది ఆటగాళ్లను పక్కన పెట్టారు అన్న విషయం కూడా వైరల్ గా మారింది. కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తే రోహిత్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేయబోతున్నాడు. ఫిట్నెస్ సాధించిన కె.ఎల్.రాహుల్ త్వరలో జట్టుకు అందుబాటులోకి వస్తానని ఇటీవల సోషల్ మీడియాలో తెలిపాడు.

 అయితే సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ కోహ్లీ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కోహ్లీ మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నారు. ఇక బ్యాక్ అప్ మిడిలార్డర్ ప్లేయర్గా శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టి ఇక దీపక్ హుడానీ తీసుకునే ఆలోచనలో ఉన్నారట భారత సెలెక్టర్లు. ఇక హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్,రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్ కూడా జట్టులో అవకాశం దక్కించుకొనున్నారు. అయితే రవీంద్ర జడేజా గాయంతో బాధపడుతున్న నేపథ్యంలో అతడు ఆసియా కప్ ఆడటం పై సందేహాలు నెలకొన్నాయి..
కాగా జట్టు అంచనా ఇలా ఉంది :
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్/దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్/ అక్షర్ పటేల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: