ధోని తీసుకున్న నిర్ణయం వల్లే.. ఓపెనర్ రోహిత్ ఉన్నాడు?

praveen
జట్టు కెప్టెన్ చేపట్టిన తర్వాత కొంత మంది ఆటగాళ్లు ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మరికొంతమంది మాత్రం ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అదే సమయంలో ఇక ఎంతో మంది కెప్టెన్లు జట్టుకు విజయం అందించడం కోసం ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా సారథులు చేసే ప్రయోగాలు సక్సెస్ అయినప్పుడు ఎవరు ఏం అనరు కానీ ఒకవేళ విఫలం అయితే మాత్రం ఇక కెప్టెన్ పై విమర్శలు సందించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఆటగాళ్లపై పూర్తి నమ్మకం పెట్టుకొని ప్రయోగాలు చేసే కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ మొదటి స్థానంలో ఉంటాడు అని చెప్పాలి.

 అయితే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మీద కూడా అప్పట్లో మహేంద్రసింగ్ ధోని ఒక ప్రయోగం చేశాడు అనే విషయం తెలిసిందే. జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో రోహిత్ శర్మ మొదటి మిడిలార్డర్ బ్యాట్స్మెన్ గా కొనసాగాడు. అయితే 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రోహిత్ శర్మను ధోని ప్రయోగం చేసి ఓపెనర్గా బరిలోకి దిగుతాడు. ఇక అప్పటి నుంచి రోహిత్ శర్మ దశ మారిపోయింది అని చెప్పాలి. అప్పుడు అద్భుతమైన ఫామ్లో ఉన్న దినేష్ కార్తీక్ ను కాదని ధోనీ ఇక రోహిత్ శర్మ విషయంలో ఈ నిర్ణయం తీసుకుని సాహసం చేశాడు అంటూ ఇటీవలే ఈ విషయాన్ని టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ గుర్తుచేసుకున్నాడు.

 ఇటీవలే వెస్టిండీస్తో 3వ టి20 మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ కి ఓపెనర్ గా ప్రమోషన్ ఇచ్చాడు. తొలి రెండు మ్యాచ్ లలో విఫలమైన సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్గా మాత్రం అరుదైన ఇన్నింగ్స్ తో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే స్పందిస్తూ మాజీ ఫీల్డింగ్ కోచ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే అప్పట్లో ధోని నిర్ణయాలు ఎంతో కీలకంగా మారిపోయేవి. అతని నిర్ణయాలు చాలా గొప్పవి కూడా అంటూ శ్రీధర్ తెలిపాడు. రెండేళ్ల క్రితమే జట్టులోకి సూర్యకుమార్ యాదవ్ ని తీసుకోవాలని భావించినప్పటికీ విరాట్ కోహ్లీ శ్రేయస్ ఉన్న కారణంగా అతనికి అవకాశం దక్కలేదు. ఎంతో ప్రతిభ కల సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి రావడం మాత్రం ఎంతో సంతోషకరమైన విషయం అంటూ ఆర్ శ్రీధర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: