ఆరోజు గౌతం గంభీర్ నన్ను నమ్మాడు : సునీల్ నరైన్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన జట్లలో అటు కోల్కతా నైట్రైడర్స్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. అయితే ఇక కోల్కత నైట్రైడర్స్ జట్టుకు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎన్నో ఏళ్ల పాటు కెప్టెన్సి చేపట్టాడు. తన కెప్టెన్సీ తో మంచి విజయాలు సాధించాడు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. అయితే ఇక గౌతం గంభీర్ కోల్కతా జట్టు కెప్టెన్గా ఉన్న సమయంలోనే వెటరన్ ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఓపెనర్గా బరిలోకి దిగి తన సత్తా ఏంటో చూపించాడు. అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు అనే విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే తన మీద నమ్మకం పెట్టుకొని తనను ఓపెనర్గా గౌతం గంభీర్ పంపాడు అన్న విషయాన్ని ఇటీవల సునీల్ నరైన్ గుర్తుచేసుకున్నాడు. ఈక్రమంలోనే గౌతం గంభీర్ పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ 2017 ఎడిషన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగాడు  సునీల్ నరైన్.  కాగా అద్భుతమైన షాట్లతో కొన్ని మ్యాచ్ లలో చెలరేగి ఆడాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి సిక్సర్లూ, ఫోర్లతో చెలరేగిపోతు ఉండేవాడు సునీల్ నరైన్. అయితే కొలకత్తాకు కెప్టెన్సీ నుంచి గౌతం గంభీర్  తప్పుకున్న  తరువాత మాత్రం అతనికి సరైన అవకాశాలు రాలేదు అని చెప్పాలి.

 2012లో మళ్లీ కోల్కత నైట్ రైడర్స్ తరఫున ఆరంగేట్రం చేశాడు. కాగా ఇప్పటివరకు 148 ఐపీఎల్ మ్యాచ్లలో ఒక వెయ్యి 25 పరుగులు చేశాడు సునీల్ నరైన్. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం. అయితే గౌతమ్ గంభీర్ నన్ను ఓపెనింగ్ లో బ్యాటింగ్ చేయించడంతో  మరింత విశ్వాసం పొందాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇన్నింగ్స్ ని వేగంగా ప్రారంభించాలని ఎప్పుడూ గౌతం గంభీర్ నాకు చెప్పాడు. త్వరగా వికెట్ కోల్పోయిన పర్వాలేదు. కానీ విధ్వంసం సృష్టించాలి అంటూ గౌతం గంభీర్ సూచించాడు.. ఇక తాను ప్రతి బంతిని బలంగా కొట్టేవాడిని అది ఎంతగానో ఉపయోగపడింది. అయితే నన్ను గౌతం గంభీర్ను ఓపెనర్గా పంపే వరకు కూడా ఆ విషయం నాకు తెలియదు అంటూ సునీల్ నరైన్ చెప్పుకొచ్చాడు. అతను కెప్టెన్ గా ఉండడం నాలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: