వాషింగ్టన్ సుందర్ వేసిన బంతికి.. బ్యాట్స్మెన్ తెల్లమొహం వేశాడు?

praveen
టీమిండియాలో ఆఫ్ స్పిన్నర్ గా ఎంతగానో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ 1 లో ఆడుతూ బిజీబిజీగా గడుపుతున్నాడు అన్న విషయం తెలిసిందే. గాయం భారీ నుంచి కోలుకుని ప్రస్తుతం తన ఫిట్నెస్ నిరూపించుకోవాలనే కసితో ఉన్న వాషింగ్టన్ సుందర్ కు  కౌంటి ఛాంపియన్షిప్ లో ఛాన్స్ రావడం ఒక సువర్ణావకాశం అని చెప్పాలి. లంకషైర్ జట్టులో తరఫున ఆడుతున్నాడు వాషింగ్టన్ సుందర్. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నాడు.

 ఇటీవలే మొదటి మ్యాచ్లోనే 5 వికెట్లు సాధించి జట్టుకు విజయాన్ని అందించిన వాషింగ్టన్  సుందర్ కెంట్ తో జరిగిన మ్యాచ్ లో తన ఆఫ్ స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి బ్యాట్స్మెన్ అందరిని కూడా తికమక పెట్టేసాడు. బంతిని గింగిరాలు తిప్పుతూ అదరగొట్టేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్ వేసిన ఒక బంతి నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. ఇది చూసిన బ్యాట్స్ మెన్ ఒక్కసారిగా తెల్లమొహం వేశాడు. ఇది ఎలా సాధ్యం అయిందో అంటూ నమ్మలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 వాషింగ్టన్ సుందర్ వేసిన బంతి గింగిరాలు తిరుగుతూ ఆఫ్ స్టంప్ మీదుగా వెళ్లి అయితే బంతిని డిఫెండ్ చేయాలని ప్రయత్నించారు. డిఫెండ్ చేద్దాం అనుకున్నాడు.  కాదు కానీ బంతిని ఆపడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి ప్యాడ్స్  సందులో నుంచి వెళ్లి వికెట్ లను గిరాటేసింది. అయితే బంతి ఎలా వెనక్కి వెళ్ళింది అర్థంకాక ఒక్కసారిగా అవాక్కాయ్యడు. అయితే కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే చేసిన జోర్దాన్ కాక్స్ చివరికి వాషింగ్టన్ సుందర్ వేసిన అద్భుతమైన బంతితో పెవిలియన్ చేరాడు అని చెప్పాలి.. ఇందుకు సంబంధించిన వీడియోను కౌంటి ఛాంపియన్షిప్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: