ప్లీజ్ అలా చేయండి.. బీసీసీఐకి లెజెండరీ క్రికెటర్ విజ్ఞప్తి?

praveen
సాధారణంగా బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో విదేశీ క్రికెటర్లదే ఎక్కువ హవా నడుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది క్రికెటర్లు ఐపీఎల్లో ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఐపీఎల్లో ఆడటం కారణంగా ఒకవైపు ఆదాయంతో పాటు మరోవైపు అనుభవం కూడా వస్తుందని భావిస్తూ ఉంటారు. అందుకే ఇక ఐపీఎల్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది అని చెప్పాలి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. భారత ఆటగాళ్లు మాత్రం విదేశీ లీగ్ లలో ఇప్పుడు వరకు ఆడలేదు అన్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఇలా భారత ఆటగాళ్లు ఇతర దేశాలు నిర్వహించే లీగ్ లలో ఆడడానికి బీసీసీఐ పర్మిషన్ ఇవ్వకపోవడమే.

 ఒకవేళ క్రికెటర్లకు ఆడాలని ఉన్న బీసీసీఐ నిబంధనల కారణంగా విదేశీ లీగ్ లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయంపై ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు లెజెండరీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఆటగాళ్లను విదేశీ లీగ్ లో ఆడకుండా నిబంధనలు విధించడం పై బీసీసీఐ కాస్త మొండిపట్టు వీడాలి అంటూ సూచించాడు. భారత ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా వారిని ఇతర దేశాల లీగ్ లలో కూడా ఆడించాలి అంటూ విజ్ఞప్తి చేశాడు. భారత ఆటగాళ్లు బిగ్ బాష్ లీగ్,  కరేబియన్ ప్రీమియర్ లీగ్ లాంటి విదేశీ లీగ్ లలో ఆడటం వల్ల ఐపీఎల్ బ్రాండ్  కూడా పెరుగుతుందని చెప్పుకొచ్చాడు.

 అంతేకాదు బిసిసీఐ తమ ప్లేయర్లను  విదేశాల్లో టీ20 లీగ్ ఆడేందుకు అనుమతిస్తే ఇది క్రికెట్ పరిణితికి  కూడా ఎంతగానో తోడ్పడుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో 6 సీజన్ లు ఆడిన అనుభవం తో ఈ మాట చెబుతున్నాను అంటూ ఆడమ్ గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఐపీఎల్ ప్రపంచంలోనే టాప్ టీ20 లీగ్ అనడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు ఐపీఎల్ నిర్వహిస్తున్న బిససీఐ ప్రపంచ క్రికెట్కు పెద్దన్న లాంటిది అంటూ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ పై ఐపీఎల్ ఫ్రాంఛైజీల ఆధిపత్యం ఎక్కువైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మరునాడే గిల్ క్రిస్ట్  ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: