కామన్వెల్త్ గేమ్స్.. మొదటి మ్యాచ్ కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్?

praveen
ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత మొదటిసారి కామన్వెల్త్ గేమ్స్ లో టి20 ఫార్మాట్ క్రికెట్ చేరింది అన్న విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని ఒక అరుదైన గౌరవం గా భావిస్తూ ఉన్నారు ప్రస్తుతం క్రికెట్ ప్లేయర్స్. కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ప్రపంచ దేశాల జట్లతో టి20 లీగ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే మొదటిసారి కామన్వెల్త్ గేమ్స్ లో ఎలాగైనా విజయఢంకా మోగించాలి అనే పట్టుదలతో ఉన్నాయి అన్ని జట్లు. ఈ క్రమంలోనే భారత జట్టు కూడా ఇప్పటికే ప్రాక్టీస్ లో మునిగితేలుతోంది అన్న విషయం తెలిసిందే.

 ఇక కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా నేడు తొలి మ్యాచ్ ఆడేందుకు భారత మహిళల జట్టు కూడా సిద్ధమైంది. అయితే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టును ఢీ కొట్ట పోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ తొలి మ్యాచ్ కి ముందే  భారత మహిళల జట్టుకు ఒక శుభవార్త అందింది అని తెలుస్తోంది. కరోనా వైరస్ బారిన పడిన బ్యాటర్  మేఘన ఇటీవలే వైరస్ నుంచి కోలుకుందట. ఇటీవల నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షలో భాగంగా ఆమెకు నెగిటివ్గా వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బర్మింగ్హామ్ లో ఉన్న భారత జట్టు లో చేరేందుకు సిద్ధమైంది మేఘన.

 ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె ధ్రువీకరించింది అని చెప్పాలి. అయితే కామన్వెల్త్ గేమ్స్ కోసం అటు భారత మహిళల జట్టు బర్మింగ్హామ్ ప్రయాణం అయ్యేందుకు ఒక్కరోజు ముందు ఆల్రౌండర్ పూజా,  బ్యాటర్ మేఘనా కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో వీరిద్దరూ బర్మింగ్హామ్ వెళ్లే విమానం ఎక్కకుండా అనేక బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉండిపోయారు. అయితే మేఘన ఇటీవలే కరోనా వైరస్ నుంచి బయటపడగా.. పూజ మాత్రం ఇంకా వైరస్ నుంచి కోలుకోలేదు అన్నది తెలుస్తుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: