తన బ్యాటింగ్ ఆర్డర్ పై.. హనుమ విహారి ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
ఇటీవలే కరోనా వైరస్ బారిన పడిన రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో టెస్టు మ్యాచ్ ఆడబోయే టీమిండియాకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతను కోలుకుని మళ్లీ జట్టుతో కలవడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు మొత్తం తారుమారయ్యాయి. ముఖ్యంగా భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు ఎవరు ఇక కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్గా బరిలోకి దిగె ఆటగాళ్లు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే తెలుగు తేజం టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ హనుమ విహారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఇంగ్లాండ్తో జరగబోయే టెస్టులో ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను.  అవకాశాలు తేలికగా రాలేదు అంటూ హనుమ విహారి చెప్పుకొచ్చాడు. అవకాశాలు వచ్చే వరకు వేచి చూసే అంత ఓపిక నాకు ఉంది. వచ్చిన అవకాశాన్ని అసలు వదులుకోను. ఇక భారత జట్టులో పోటీ తీవ్రంగా ఉంది. యువ ఆటగాళ్లు తమకు భారత జట్టులో ఎప్పుడు చోటు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక భారత జట్టు తరఫున బరిలోకి దిగిన తర్వాత అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

 ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ తన పై ప్రశంసలు కురిపించడం ఎంతో భావోద్వేగానికి గురి చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఓపెన్ చేయమని అడిగినప్పుడు అతను స్పందించిన విధానం ఎంతగానో ఆకట్టుకుందని కోహ్లీ కొనియాడాడు. అయితే ఇంగ్లాండ్తో జరిగే ఏకైక టెస్టులో హనుమ విహారి కి చోటు దొరకడం కష్టమే అని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఛటేశ్వర్ పూజారా మంచి ఫామ్ లో కనబడుతున్నారు. హనుమ విహారి మాత్రం ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచ్లో పెద్దగా తన బ్యాటింగ్ తో ఆకట్టుకోలేకపోయాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: