టి20 ప్రపంచకప్ తర్వాత.. టీమిండియా పర్యటన అక్కడికేనట?

praveen
ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లతో పాటు ఇక టీమిండియా సెలెక్టర్లు కూడా ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు . కారణం అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా  టి20 వరల్డ్ కప్ ఉండటమే. ఇప్పటికే టీమిండియా తరపున ఎంతో మంది యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లు కూడా ప్రతిభ చాటుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టి20 వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలతో ఉంది. టీమిండియా వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే జట్టు అత్యుత్తమ గా ఉండాలని ఎలాంటి పొరపాట్లు చేయకూడదని బిసిసీఐ సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక రెండు జట్లను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.

 ఇలా ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లతో పాటు సెలెక్టర్లు బిసిసీఐ అధికారుల దృష్టి మొత్తం కేవలం వరల్డ్ పైనే ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏ ఆటగాడు ఎలాంటి ప్రదర్శన చేస్తున్నాడు.. ఒత్తిడిలో ఎలా రాణిస్తున్నాడు లాంటి అన్ని విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇక ఆస్ట్రేలియా వేదిక జరగబోయే టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా పర్యటన ఖరారు అయ్యింది అనేది తెలుస్తుంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే టీమిండియా అటు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లి పోతుంది అని తెలుస్తుంది.

 ఈమేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అటు న్యూజిలాండ్ పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేసిందట. నవంబర్ 18 నుంచి 30 వరకు 3 టీ20 లు, 3వన్డే మ్యాచ్ లలో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత్ తలపడనుంది. ఇక బదులుగా వచ్చే ఏడాది జనవరిలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్ లో అటు న్యూజిలాండ్ పర్యటనకు రానుంది  అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 18, 20,22 తేదీలలో 3 టీ20 మ్యాచ్ లు జరగబోతున్నాయి. 25, 27, 30 తేదీలలో మూడు వన్డే మ్యాచ్లను అటు న్యూజిలాండ్ వేదికగా ఆడబోతుంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: