ఆడించనప్పుడు.. అతన్ని దేశాలు తిప్పడం ఎందుకు?
ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 47 పరుగులు చేశాడు అనే విషయం తెలిసిందే ఇక రెండో మ్యాచ్‌లో కూడా రుతురాజ్ కూడా అందుబాటులో లేడు. ఇక అతని స్థానంలో ఓపెనింగ్ చేసేందుకు సంజు శాంసన్ ను జట్టులోకి తీసుకున్నారు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ జట్టులో ఆడనప్పుడు వెంకటేష్ అయ్యర్ కి అవకాశం ఇస్తారని భావించాను అంటూ చెప్పుకొచ్చాడు. 2021 ఐపీఎల్ సీజన్ లో ఓపెనర్‌గా వెంకటేష్ అయ్యర్ రాణించాడు అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే వెంకటేష్ అయ్యర్ కి అవకాశం ఇవ్వలేము అనుకున్నప్పుడు అతని ఇలా విదేశీ పర్యటనలకు ఎందుకు తీసుకెళ్తున్నారు.. జట్టులో పెట్టుకుని రిజర్వ్ బెంచ్ లో ఎందుకు కూర్చో పెడుతున్నారు అంటూ ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు. కేవలం టూరిస్ట్ వీసా మీద అతను ఐర్లాండ్ కి వెళ్ళలేదు కదా.. ఆడించకుండానే అలా తిప్పి చూపించి తీసుకురావడానికి అంటూ ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. కాగా ఇప్పుడు వరకు వెంకటేష్ అయ్యర్ టీమిండియా తర్వాత 9 టి20 మ్యాచ్‌లు ఆడాడు.