టి20 క్రికెట్ లో.. బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న టీమిండియా ఆటగాళ్లు వీళ్లే?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ ల విధ్వంసానికి  మారుపేరు అనే విషయం తెలిసిందే.  ఎందుకంటే టెస్టు ఫార్మాట్లో లాగ తీరిగ్గా పరుగులు చేద్దాంలే అనుకోవడానికి వీలు ఉండదు.. వన్డే ఫార్మాట్ లాగా అటు క్రీజు లో కుదురుకున్నాక పరుగులు చేద్దాంలే అనుకోవడానికి అవకాశం ఉండదు.. ప్రతి ఒక బ్యాట్స్మెన్ కూడా మైదానంలోకి వచ్చాడు అంటే చాలు  సిక్సర్లు ఫోర్ లతో చెలరేగి పోవాల్సిందే. లేదంటే అతని పై విమర్శలు రావడం తప్పక జరుగుతూ ఉంటుంది. అందుకే టీ-20 ఫార్మెట్లో బౌలర్ల పై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఎంతోమంది బ్యాట్స్మెన్లు వీర విహారం చేస్తూ ఉంటారు.

 స్కోర్ బోర్డు సైతం అలసిపోయేలా పరుగుల వరద పారిస్తు ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు టీ-20 ఫార్మెట్లో స్ట్రైక్ రేట్ కూడా ఎంతో ముఖ్యం అన్న విషయం తెలిసిందే.  ఇక ఇలా భారత జట్టు తరఫున ఇప్పటివరకు అత్యుత్తమ స్ట్రైక్ రేట్తో టీ-20 ఫార్మెట్లో కొనసాగుతున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక ఈ లిస్టులో చూసుకుంటే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ ప్రస్తుత టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఎప్పుడు క్రీజ్లోకి వచ్చిన పిట్ట కొంచెం కూత ఘనం అనే విధంగా బౌలర్ల పై విరుచుకుపడుతూ సిక్సర్లు బాదుతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.
 ఇక ఒక సారి స్ట్రైక్ రేట్ పరంగా పూర్తి వివరాలు చూసుకుంటే.. హార్దిక్ పాండ్యా 40 మ్యాచ్ లలో 670 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 147.57  కావడం గమనార్హం. ఇక కేఎల్ రాహుల్ 52 మ్యాచ్లో 1831 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 142.49. రోహిత్ శర్మ 117 మ్యాచ్లో 3313 పరుగులు చేశాడు. ఇక హిట్ మాన్ స్ట్రైక్ రేట్ 139.55 శ్రేయస్ అయ్యర్ 37 మాసములలో 903 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 139.35 కావడం గమనార్హం. విరాట్ కోహ్లీ 89 ఎన్నికలలో 3296 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 137.67. యువరాజ్ సింగ్ 51 మ్యాచ్లలో 1177 పరుగులు చేయగా స్ట్రైక్ రేట్ 136.38 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: