ఉమ్రాన్ కంటే వేగంగా బౌలింగ్.. 208 కి.మీ వేగంతో?

praveen
ఇటీవల యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐర్లాండ్ పర్యటనలో భాగంగా అటు హార్దిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్సీ చేపట్టాడు. ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కి కూడా కెప్టెన్సీ నిర్వహించిన అనుభవం లేని హార్దిక్ పాండ్యా ఇండియా సారథ్య బాధ్యతలను ఎలా నిర్వహిస్తాడో అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో రాణించిన టీమిండియా కెప్టెన్గా కూడా హార్దిక్ పాండ్యా రాణించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి టి20 మ్యాచ్ లో ఐర్లాండ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా జట్టు.

 తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 12  ఓవర్లలో  4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.  అయితే అప్పటికి వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో మ్యాచ్ 12 ఓవర్లకు కుదించారు. తర్వాత చేదనకు  దిగిన భారత జట్టు 9.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో   విజయం సాధించింది. ఐర్లాండ్ తో మొదటి టి20 మ్యాచ్ లో అటు ఉమ్రాన్ మాలిక్ కూడా చోటు దక్కించుకుని తనదైన శైలిలో రాణించాడు. అయితే కేవలం ఒకే ఓవర్ వేసి  14 పరుగులు సమర్పించుకున్నాడు.

 ఉమ్రాన్ మాలిక్ జట్టులో ఉన్నాడు అంటే చాలు అతని కంటే వేగంగా బంతులు వేసే  బౌలర్ భారత జట్టులో లేడు. కానీ ఇటీవలే ఉమ్రాన్ మాలిక్ కంటే ఎక్కువ వేగంతో బంతులను విసిరాడు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. ఏకంగా రెండు వందల ఎనిమిది కిలోమీటర్ల వేగంతో బంతిని విసరడం గమనార్హం. దీంతో ఇక భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు సాధించాడు అంటూ అభిమానులు అందరూ కూడా భావించారు. భువనేశ్వర్ బౌలింగ్ 208 కిలోమీటర్ల వేగంతో వచ్చినట్లు స్పీడ్ గన్  తేల్చింది. కానీ ఆ తర్వాతే అసలు విషయం బయటపడింది. సాఫ్ట్వేర్ లోపం కారణంగానే స్పీడ్ గన్ వేగాన్ని తప్పుగా చూపించిందని  నిర్వాహకులు తేల్చారు. గతంలో అండర్-19 ప్రపంచకప్ లో కూడా స్పీడ్ గన్ 175 కిలోమీటర్ల వేగంతో చూపించిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: