సంజు ను అందుకే ఆడించడం లేదా? ఇంకేమైనా సమస్య ఉందా ?

VAMSI
ఇండియా లో ఇప్పుడున్న యువ క్రికెటర్లు అందరికీ జీవితంలో ఒక లక్ష్యం ఉండనే ఉంటుంది. కనీసం ఒక్కసారైనా భారత క్రికెట్ జట్టుకు ఆడాలని కలలు కంటూ ఉంటారు. కానీ కొందరు మాత్రం అనుకున్న విధంగానే ఎంతో శ్రమించి దేశవాళీ మరియు ఐపిఎల్ లో రాణించి సెలక్టర్లను ఆకర్షిస్తూ ఉంటారు. కానీ అలా అందరి లాగే దేశవాళీలో అద్భుతంగా రాణించి 2015 లోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు కేరళ కుర్రాడు సంజు శాంసన్. కానీ దాదాపు ఏడు సంవత్సరాలుగా అతను ఆడింది కేవలం 13 టీ 20 లు మాత్రమే. ఐపిఎల్ లో రాణిస్తున్నా అంతర్జాతీయ స్థాయిలో అవకాశం వచ్చినా ఫెయిల్ అవుతున్నాడు.
దానితో మళ్లీ ఒకటి రెండు సంవత్సరాలు అతనిపై వేటు వేయడం ఇలా జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల ముగిసిన ఐపిఎల్ సీజన్ 15 లో అద్భుతంగా రాణించి తన జట్టును ఫైనల్ వరకు చేర్చిన తర్వాత కూడా సౌత్ ఆఫ్రికా తో స్వదేశంలో జరిగిన టీ 20 సీరీస్ కు ఇతన్ని ఎంపిక చేయలేదు... అప్పటి నుండి టీమ్ మేనేజ్మెంట్ పై విమర్శలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం జూనియర్ జట్టు ఐర్లాండ్ పర్యటన కోసం వెళ్ళింది. ఇందులో మాత్రం సంజు శాంసన్ ను ఎంపిక చేసింది. కానీ అత్రి ఐర్లాండ్ తో జరిగిన మొదటి టీ 20 లో మాత్రం అతన్ని తుది జట్టులోకి తీసుకోకుండా... మరోసారి కోచ్ అతనిపై వేటు వేశాడు.

అయితే ఇందుకు కారణం ఏమిటని నెటిజన్లు అంతా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను విమర్శిస్తున్నారు. కేవలం సంజు శాంసన్ ను సౌత్ ఇండియా కు చెందిన వాడు కాబట్టే ఇలా చేస్తున్నారని వాపోతున్నారు. మరి రేపు జరగనున్న రెండవ మ్యాచ్ లో అయినా శాంసన్ ను ఆడిస్తారా అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: