విడాకులు తీసుకున్న మహిళలను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీరే ?

VAMSI
సెలబ్రెటీల జీవితం చాలా స్పెషల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం. వారి స్వేచ్ఛాయుత జీవితంలో ఎక్కువగా సొంత నిర్ణయాలు తీసుకుంటుంటారు. విలాసవంతమైన జీవితం, అందరిలో గుర్తింపు ఇలా ప్రతీది స్పెషల్. అంతేకాదు ఇక్కడ లివింగ్ రిలేషన్ షిప్స్, ప్రేమలు ,పెళ్ళిళ్ళు నచ్చక పోతే కొన్ని సార్లు విడిపోవడం ఇలాంటివి సర్వ సాధారణం. అందులోనూ విడిపోయాక మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం కుదిరితే అది కూడా తూచ్ అని మరో పెళ్లి చేసుకోవడం వంటి సందర్భాలు కూడా చాలానే చూసాం. ఇక క్రికెటర్ల విషయానికి వస్తే ... టీమ్ ఇండియా లో డైవర్స్ అయిన మహిళల్ని పెళ్లి చేసుకున్న క్రికెటర్లు ఎవరైనా ఉన్నారా అంటే అవును చాలా మంది ఉన్నారు అని అంటారు. అవును ఇది నిజమే కొందరు స్టార్ క్రికెటర్లు కొందరు డైవర్సీ లను పెళ్లి చేసుకున్నారు. ఇపుడు వారి గురించి తెలుసుకుందాం.
అటువంటి క్రికెటర్లు ఉన్నారు. సమాజం మాట పక్కన పెట్టి కొందరు క్రికెటర్లు పెళ్ళై విడాకులు తీసుకున్న మహిళల ప్రేమించి వారిని  పెళ్లాడారు.
శిఖర్ ధావన్: ఈ భారత్ క్రికెటర్ 2012లో ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. ఈమె..మెల్బోర్న్ నివాసి అయిన బ్రిటీషు బెంగాలీ మహిళ. ఆయేషా కి ముందుగా ఒక వ్యక్తి తో పెళ్ళై ఇద్దరు కూతుర్లు కూడా ఉండగా విడాకులు తీసుకుని శిఖర ధావన్ ని రెండో పెళ్లి చేసుకున్నారు.. వయసులో కూడా తనకంటే పదేళ్లు పెద్దయిన ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధావన్. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..  గత ఏడాది శిఖర్ ధావన్, ఆయేషాల కూడా  విడాకులు తీసుకుని విడిపోయారు.
మురళి విజయ్: టీమ్ ఇండియా ఓపెనర్ అయిన మురళీ విజయ్  నికితా వంజార ను వివాహం చేసుకున్నారు. నికితా ఎవరో కాదు... టీమ్ ఇండియా మరో క్రికెటర్ అయిన దినేష్ కార్తీక్ తొలి భార్య... అయితే అతడితో విడాకులు తీసుకున్న నికిత ఆ తరవాత విజయ్‌ ను పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఈ విషయం ఎంత వైరల్ అయ్యింది తెలిసిందే.

అనిల్ కుంబ్లే: మరో భారతీయ క్రికెటర్, స్పిన్ బౌలర్ అయిన అనిల్ కుంబ్లే భార్య చేతన కూడా డైవర్సీనే. ఈమెను 1999లో పెళ్లి చేసుకున్నాడు అనిల్ కుంబ్లే. ఇప్పటికీ ఈ జంట అంతే సంతోషంగా కలిసి జీవిస్తున్నారు.

 
వెంకటేశ్ ప్రసాద్: టీమ్ ఇండియా మాజీ పేస్ బౌలర్ అయిన వెంకటేశ్ ప్రసాద్ కూడా జయంతి అనే  ఓ డైవర్సీ మహిళనే వివాహం చేసుకున్నాడు. వీరికి పరిచయం అనిల్ కుంబ్లే వలనే జరిగిందట. అలా క్రికెటర్ అనిల్ కుంబ్లే ద్వారా కలిసిన వీరిద్దరూ 1996లో పెళ్లి చేసుకున్నారు.

 మొహమ్మద్ షమీ: ఈ లిస్ట్ లో టీమ్ ఇండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ కూడా ఉన్నారు. షమీ 2014లో హసీన్ జహాను అనే వివాహితను పెళ్లి చేసుకున్నాడు. అప్పటిక ఆమెకి పెళ్ళై విడాకులు కూడా అయిపోగా ఆ తరవాత హాసీన్ ను పెళ్లి చేసుకున్నారు షమీ.  అయితే ఈ మధ్య వీరి మద్య అంతగా సఖ్యత లేదని విడివిడిగా ఉంటున్నారు అని వార్తలు వినపడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: