టీమిండియా ఓపెనింగ్ స్థానం కోసం.. తెలుగు క్రికెటర్ల మధ్య పోటీ?

praveen
గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా ఇక 5వ టెస్టు మ్యాచ్ రద్దు చేసుకుంది. ఇకపోతే ఈ ఐదో టెస్టు ఇన్ని రోజుల తర్వాత ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఒప్పందం మేరకు జులై 1వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది. ఇలాంటి సమయంలో మళ్లీ కరోనా వైరస్ టీమిండియాకు ఇబ్బందులు సృష్టిస్తోంది అన్న విషయం తెలిసిందే. వరుసగా ఆటగాళ్లు వైరస్ బారినపడుతున్న నేపథ్యంలో టీమిండియా  అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు.

 అయితే అటు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విదేశాల్లో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడలేదు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇంగ్లాండులో ఆడటానికి సిద్ధమైంది. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడటం సంచలనంగా మారింది. ఇటీవలే ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా షాపింగ్ కి వెళ్ళిన రోహిత్ శర్మ అక్కడ అభిమానులతో కలిసి ఫోటోలు దిగేందుకు ఫోజులు ఇచ్చాడు దీంతో  వైరస్ బారిన పడ్డాడు అని తెలుస్తుంది. అయితే జూలై 1వ తేదీ నాటికి అతను కోలుకోవడం కాస్త కష్టంగానే కనిపిస్తోంది.

 ఇలాంటి సమయంలో ఇక టెస్టు మ్యాచ్లో టీమ్ ఇండియా ఓపెనింగ్ జోడి ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ జోడి ఓపెనర్లుగా రావలసి ఉండగా.. ఇప్పుడు రోహిత్ శర్మ వైరస్ బారినపడి దూరమవడంతో ఇక ఖాళీగా ఉన్న ఓపెనర్ స్థానం కోసం ఇప్పుడు ఇద్దరు తెలుగు క్రికెటర్లు రేసులో ఉన్నారు అనేది తెలుస్తుంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు హనుమ విహారి, కేఎస్ భరత్. ఇటీవలే జరిగిన వార్మప్ మ్యాచ్లో కెఎస్ భరత్ మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. అయితే అటు హనుమ విహారి మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయాడు అనే విషయం తెలిసిందే. మరి ఈ ఇద్దరిలో ఎవరికి ఓపెనర్గా అవకాశం దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: