రికార్డ్ సృష్టించిన భువనేశ్వర్.. టి20 చరిత్రలోనే?

praveen
ప్రస్తుతం భారత జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. భారత బౌలింగ్ విభాగానికి ముందు నడిపించే సీనియర్ బౌలర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక టీమిండియాలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్గా కూడా అటు భువనేశ్వర్ కుమార్ కి ప్రత్యేకమైన గుర్తింపు. ప్రస్తుతం టీమిండియా లో ఎంతో మంది బౌలర్లు ఉన్న అటు భువనేశ్వర్ కుమార్ లాగా స్వింగ్ బౌలింగ్ తో బ్యాట్స్మెన్లను బోల్తా కొట్టించడం మాత్రం మిగతా వాళ్లకు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇలా తన స్వింగ్ బౌలింగ్ తోనే ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని టీమిండియాలో కీలక బౌలర్ గా ఎదిగాడు భువనేశ్వర్ కుమార్.

 అయితే మొన్నటి వరకు గాయాల కారణంగా టీమిండియాకు దూరమవుతూ వచ్చిన భువనేశ్వర్ కుమార్ ఇక ఇటీవలే అటు ఐపీఎల్లో మాత్రం అద్భుతంగా పుంజుకున్నాడు అన్న విషయం తెలిసిందే. మునుపటి ఫామ్ లోకి వచ్చాను అని సెలెక్టర్లకు తన ఆటతో చెప్పకనే చెప్పాడు. ఈ క్రమంలోనే అటు టీమిండియాలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. ఇక టీమిండియా తరపున కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు భువనేశ్వర్ కుమార్. ఇకపోతే ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇక ఇటీవల మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

 టి20 ఫార్మాట్ చరిత్రలోనే పవర్ ప్లే లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ రికార్డ్ సృష్టించాడు. సాధారణంగా పవర్ ప్లే లో బ్యాట్స్మెన్లు ఎంతో దూకుడుగా ఆడుతూ ఉంటారు. కానీ భువనేశ్వర్ కుమార్ కి మాత్రం తన కట్టుదిట్టమైన బౌలింగ్ తో అటు బ్యాట్స్మెన్లను తికమక పెడుతూ వికెట్లు పడగొట్టడమే కాదు తక్కువ పరుగులు ఇస్తూ ఉంటాడు. ఇలా టీమిండియాకు ఎప్పుడూ మంచి ఆరంభం అందిస్తూ ఉంటాడు భువనేశ్వర్ కుమార్. ఇక ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన టి20 మ్యాచ్ లో తొలి ఓవర్లోనే ఆండ్రూ బాల్బీర్ ని భువనేశ్వర్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక ఈ వికెట్ ద్వారా టి20 చరిత్రలో పవర్ ప్లే లో అత్యధిక వికెట్లు (34) తీసిన బౌలర్ గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: