వారెవ్వా.. 73ఏళ్ళ రికార్డు బద్దలు కొట్టిన క్రికెటర్?

praveen
సాధారణంగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాలి అనేది అందరి క్రికెటర్ల కల. ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత రికార్డుల మోత మోగించాలి అని ఎంతో మంది క్రికెటర్లు ఆశ పడుతూ ఉంటారు. ఇలా తన పేరిట ఎన్నో రికార్డులను దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలోనే కసరత్తులు చేస్తూ ఇక మ్యాచులలో అద్భుతంగా రాణిస్తూ ఉంటారు అని చెప్పాలి.. ఇలా ఇప్పటివరకు ఎన్నో అరుదైన రికార్డులు సాధించిన ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇక ఇటీవలే న్యూజిలాండ్ క్రికెటర్ కూడా 73 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టి తన పేరున లిఖించుకున్నాడు. దీంతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు మొత్తం ఈ రికార్డు గురించి ప్రస్తుతం చర్చించుకుంటున్నారు అని చెప్పాలి.

 ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టు మ్యాచులు ముగిశాయి. ఇక ప్రస్తుతం మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ లో నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా పోరు జరుగుతుంది అని చెప్పాలి. ఒక ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ పై చేయి సాధిస్తే మరో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ అదరగొడుతు ఇంగ్లాండ్పై  పైచేయి సాధిస్తూ ఉండడం గమనార్హం. దీంతో టెస్ట్ మ్యాచ్  ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా మారిపోయింది.. ఇక ఇటీవలే మూడో టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ అరుదైన రికార్డు సాధించాడు.

 ఇప్పటివరకు ఇంగ్లాండ్ న్యూజిలాండ్ తరపున ఆడిన 6 ఇన్నింగ్సులో మొత్తం కలిపి 486 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ పై ఒక సిరీస్ లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ గా 73 ఏళ్ళ రికార్డులు బద్దలు కొట్టాడు అని చెప్పాలి. అంతకుముందు 1949లో మార్టిన్ ఒకే సిరీస్లో ఇంగ్లండ్ పై 472 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడు గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టిన డారిల్ మిచెల్ 486 పరుగులతో తన కొత్త రికార్డును దక్కించుకున్నాడు. ఇప్పటికీ రెండు టెస్టుల్లో ఓడిపోయిన న్యూజిలాండ్ జట్టు సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు మూడో టెస్టులో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: