బట్లర్ మారలేదబ్బా.. మళ్ళీ అదే కొట్టుడు?

praveen
నెదర్లాండ్‌పై తుఫాను ఇన్నింగ్స్
ప్రస్తుతం జాస్ బట్లర్ పేరు వింటేనే బౌలర్లు వణికి పోతున్నారు. ఎలాంటి బాల్ వేసినా అతడు క్రీజు లో ఉండే అది బౌండరీ అవతలకు పోతోంది. ఈ ఇంగ్లిష్ వికెట్ కీపర్ గత కొన్ని నెలలుగా విధ్వంసకర బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఐపీఎల్‌ లో రాజస్థాన్ రాయల్స్‌ తరుపున ఆడిన బట్లర్ టోర్నమెంట్‌ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ అందుకున్నాడు. ఇది ముగిసిన తర్వాత తాజాగా నెదర్లాండ్ జట్టుతో ఆడుతున్న వన్డేలలో విజృంభించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు 498 చేసిన జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. అయితే బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్ కారణంగానే ఇంగ్లాండ్ జట్టుకు భారీ స్కోరు లభించింది. ఈ మ్యాచ్‌లో బట్లర్ బౌలర్లపై విరుచుకుపడిన తీరు ఇలా ఉంది.
జోస్ బట్లర్ నెదర్లాండ్స్‌పై తన అత్యుత్తమ బ్యాటింగ్ బయటకు తీశాడు. కేవలం 70 బంతుల్లో 162 పరుగులు చేశాడు. 14 సిక్సర్లు, ఏడు బౌండరీలతో చెలరేగాడు. తద్వారా, వన్డేల్లో ఇంగ్లాండ్ జట్టు అత్యధిక స్కోరు 498/4కు చేరుకోవడానికి జట్టుకు సహాయపడింది. నెదర్లాండ్స్ జట్టుపై 232 పరుగుల భారీ విజయాన్ని అందుకోవడంలో బ్యాటర్ కీలకపాత్ర పోషించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ బౌలర్‌ పాల్‌ వాన్‌ మీక్రిన్‌‌పై బట్లర్ విరుచుకుపడ్డాడు. 29వ ఓవర్‌లో అతడు వేసిన ఓ షార్ట్ పిచ్‌ బాల్ విఫలమైంది. పిచ్‌కు దూరంగా వెళ్లిపోయిన ఆ బాల్‌ను కూడా బట్లర్ విడిచిపెట్టలేదు. వెంటాడి వెళ్లి దానిని బౌండరీ దాటించాడు. ఆట తర్వాత, ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తన బ్యాటింగ్ క్రెడిట్ అంతా ఐపీఎల్‌దే అని స్పష్టం చేశాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో 17 మ్యాచుల్లో 57.53 సగటుతో 863 పరుగుల భారీ స్కోరును సాధించాడు. ఈ ఏడాది ఇండియన్ టీ20 లీగ్‌లో అతని స్ట్రైక్ రేట్ 149.05.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: