షాకింగ్ : జట్టులోకి తీసుకోలేదని.. క్రికెటర్ ఆత్మహత్యాయత్నం?

praveen
ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా క్రికెట్ ఆటకి ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది యువకులు ప్రొఫెషనల్ క్రికెటర్ గా మారడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒకసారి ప్రొఫెషనల్ క్రికెట్ లోకి అడుగు పెడితే ఇక భారీగా ఆదాయం సంపాదించవచ్చు అని కూడా కొంత మంది భావిస్తూ ఉంటారు. అయితే ఇలా క్రికెట్ ఊపిరిగా బ్రతికిన ఎంతో మంది ఆటగాళ్లకు సరైన అవకాశాలు రాకపోతే ఎప్పుడూ నిరాశ చెందుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా నిరాశలో కొన్ని కొన్ని సార్లు డిప్రెషన్ లోకి కూడా వెళ్ళి పోతూ ఉంటారు. ఇక్కడ ఓ యువకుడు తనకు జట్టులో చోటు దక్కలేదు అనే కారణంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.

 దేశవాళీ టోర్నీకి ఎంపిక చేయలేదు అనే కారణంతో చివరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాకిస్తాన్లో వెలుగులోకి వచ్చింది. షోయబ్ అనే ఫస్ట్ క్లాస్ క్రికెటర్ సింధు ప్రావిన్స్ లోని హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంటర్సిటీ ఛాంపియన్షిప్ ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ కి  ఆదేశించింది.. ఈ క్రమంలోనే ఇక కోచ్ సలహా మేరకు ట్రయల్స్ నిర్వహించి జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే షోయబ్ ను కనీసం బౌలింగ్ ట్రయల్స్ కి కూడా తీసుకోలేదు. దీంతో అతని పేరు హైదరాబాద్ జట్టులో లేకుండా పోయింది.

 ఇదే విషయంపై ఎంతగానో మనస్తాపం చెందిన సదరు యువకుడు ఇంట్లో రూమ్లో కి వెళ్లి తలుపులు వేసుకుని ఉండిపోయాడు. ఎంతకీ బయటకి రాకపొయేసరికి తల్లిదండ్రులు గమనించగా షోయబ్ తన చేతిని బ్లేడుతో పలుమార్లు కోసుకున్నాడు అని తెలిసింది. ఈ క్రమంలోనే అపస్మారకస్థితిలో పడివున్న షోయబ్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే కోచ్ లు బౌలింగ్ ట్రయల్స్ కి తీసుకెళ్ల లేదని దీంతో జట్టుకు ఎంపిక కాలేకపోయాను అనే బాధతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయాడు అని అందుకే ఆత్మహత్యాయత్నం చేశాడు అంటూ అతని తల్లిదండ్రులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: