షాకింగ్ : రిటైర్మెంట్ ప్రకటించిన సీనియర్ ఆల్రౌండర్?

praveen
భారత్లో క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు అది ఒక శకం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు  ఎంతో ఉత్కంఠభరితంగా టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే మొన్నటి వరకు కేవలం పురుషుల క్రికెట్ కు మాత్రమే ఈ రేంజ్ లో క్రేజ్ ఉండేది. కానీ ఇటీవలి కాలంలో మహిళల క్రికెట్ కి కూడా అంతకు మించి అనే రేంజ్ లో క్రేజ్ వచ్చేసింది. మేల్ క్రికెటర్లకు  ఎక్కడ తక్కువ కాదు అంటూ ఎంతో మంది మహిళా క్రికెటర్లు నిరూపించారు.

 ఈ క్రమంలోనే ఇటీవల టీమిండియాలో సీనియర్ గా కొనసాగుతున్న మిథాలీరాజ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. దాదాపు 23 ఏళ్లకు పైగానే భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మిథాలి రాజ్ రిటైర్మెంట్ ప్రకటించింది. ఇక ఇప్పుడు మరో మహిళా సీనియర్ ఆల్ రౌండర్  కూడా రిటైర్మెంట్ బాట పట్టింది అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం టీమిండియా మహిళా క్రికెట్ లో సీనియర్ ఆల్ రౌండర్ గా ఉన్నారు రూమేలి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. దీంతో టీమిండియా మహిళా క్రికెట్లో మరో శకం ముగిసింది అనేది తెలుస్తుంది.

 2005లో వన్డే ప్రపంచకప్లో ఫైనల్ చేరిన టీమిండియా జట్టులో సభ్యురాలు గా ఉందా రూమేలి. ఇంస్టాగ్రామ్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటిస్తు 23 ఏళ్ల క్రితం బెంగాల్లోని శ్యామ్ నగర్ లో ప్రారంభమైన క్రికెట్ కెరియర్ నేటితో ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొల అవుతున్నాను. నా కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులను చూశాను. 2005 కెరియర్లోనే మరిచిపోలేని సంవత్సరం. వన్డే ప్రపంచకప్లో టీం ఇండియా ఫైనల్ చేరడం అందులో నేను భాగస్వామ్యం కావడం ఎప్పటికి మర్చిపోలేను అంటూ తెలిపింది. ఇక తన కెరీర్ లో తనకు సహకరించి మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు అడ్డు తెలిపింది. కథ 2003లో ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 78 వన్డేలు, నాలుగు టెస్టులతో పాటు 18 టి20 లు ఆడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: