భువనేశ్వర్ అరుదైన రికార్డు.. టీమిండియాలో ఒకే ఒక్కడు?

praveen
ప్రస్తుతం టీమిండియా లో సీనియర్ ఫేసర్ గా కొనసాగుతున్నాడు భువనేశ్వర్ కుమార్. ఎప్పుడూ తన దైన బౌలింగ్తో టీమిండియాను విజయతీరాలకు చేర్చడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అనే చెప్పాలి. అయితే జట్టులో ఉన్న జస్ప్రిత్ బూమ్రా డెత్ ఓవర్ లలో బౌలింగ్ చేసి అదరగొడితే  ఇక సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అటు పవర్ ప్లే లో బౌలింగ్ చేస్తు వికెట్లు పడగోడుతూ ఉంటాడు. స్వింగ్ బౌలింగ్ తో బ్యాట్స్మెన్లను తికమక పడుతూ ఎంతో అలవోకగా వికెట్ను పడగొట్టడంలో భువనేశ్వర్ కుమార్ దిట్ట అనే చెప్పాలి.

 గత కొంత కాలం నుంచి గాయాల బారిన పడుతూ టీమిండియాకు దూరం అవుతూ వచ్చినా భువనేశ్వర్ కుమార్ ఇటీవలే మళ్లీ ఫిట్నెస్ సాధించి సొంత గడ్డపై టీమిండియా సౌత్ఆఫ్రికా తో ఆడిన టి-20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అటు టీమ్ ఇండియా బౌలింగ్ విభాగానికి ముందుండి నడిపించాడు భువనేశ్వర్ కుమార్. కాగా ఇక ఇప్పుడు ఈ సీనియర్ ఫేసర్ కాస్త మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని అర్థమవుతుంది.

 దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా భువనేశ్వర్ కుమార్ ఎంపికయ్యాడు. అయితే తన పదేళ్ళ అంతర్జాతీయ కెరీర్లో నాలుగో సారి ఇలా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకోవడం గమనార్హం. భారత క్రికెట్ చరిత్రలో మరో పేసర్ కూడా ఇన్నిసార్లు ఈ అవార్డును దక్కించుకోలేదు. జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు కేవలం 3 సార్లు మాత్రమే మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు గెలుచుకున్నారు. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ వారిని వెనక్కి నెట్టి అదరగొట్టేశాడు. నాలుగు మ్యాచ్ లలో 6.05 ఇక ఎకానమీ తో  6  వికెట్లు పడగొట్టాడు భువనేశ్వర్ కుమార్. దీంతో అభిమానులు అందరూ సోషల్ మీడియా వేదికగా భువనేశ్వర్ కుమార్ ని అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: