వరల్డ్ కప్ లో దినేష్ కార్తీక్ ఎందుకు వద్దు.. గంభీర్ కు సన్నీ చురకలు?

praveen
రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అనుకున్న వయసులో దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. ఐపీఎల్లో తనలో దాగివున్న సూపర్ ఫినిషెర్  ని బయటకు తీసుకు వచ్చిన దినేష్ కార్తీక్ ఎంతో నిరీక్షణ తర్వాత టీమిండియాలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. టీమిండియా లోకి వచ్చిన తర్వాత కూడా అదే దూకుడైన ఆటతోనే ప్రస్తుతం ప్రశంసలు అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే టీమిండియా సౌతాఫ్రికాతో ఆడుతున్న టీ20 మ్యాచ్లో ఆదరగొట్టేస్తున్నాడు. ఇక నాలుగో మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిందంటే అటు దినేష్ కార్తీక్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ కారణం అని చెప్పాలి.

 అద్భుతంగా రాణిస్తున్న దినేష్ కార్తీక్ గురించి ఇటీవలే గౌతం గంభీర్ షాకింగ్ కామెంట్ చేస్తాడు. అతడిని వరల్డ్ కప్ లోకి ఎంపిక చేయడం కష్టమే అంటూ వ్యాఖ్యానించాడు. కేవలం రెండు మూడు ఓవర్లు దూకుడుగా ఆడితే సరిపోదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. దినేష్ కార్తీక్ స్థానంలో ఆల్ రౌండర్ ఉంటే బాగుంటుందని  అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే సునీల్ గవాస్కర్ ఇదే విషయంపై స్పందిస్తూ పరోక్షంగా గౌతం గంభీర్ కి చురకలంటించాడు అని తెలుస్తోంది. చాలామంది దినేష్ కార్తీక్ ను టి20 ప్రపంచ కప్ లో ఎలా చేరుస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

 అతని జట్టు లోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ అడుగుతున్నారు.. మీకెలా తెలుసు అతడు ఆడటం లేదని అంటూ ప్రశ్నించారు సునీల్ గవాస్కర్. ప్రస్తుతం టీమిండియాకు అతడి లాంటి ఆటగాళ్లు కావాలి. ఆటగాళ్ళ ఫాం ఎలా ఉందో చూడండి వాళ్ళ పేరు ప్రఖ్యాతలు కాదు. ఇక ఎంపిక విషయంలో కూడా ఆటగాళ్ల ఫామ్ చూసి ఎంపిక చేయండి అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఆరు, ఏడు స్థానాలలో వచ్చే దినేష్ కార్తీక్ నుంచి ప్రతి మ్యాచ్లో 50 ఆశించలేమూ. అయితే 20 బంతుల్లో 40 పరుగులు చేసి నిలకడగా రాణిస్తున్నాడు. అందుకే అతని  ప్రపంచకప్ కు ఎంపిక చేయాలి. అతను ప్రపంచ కప్ కి అర్హుడు అంటూ సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: