గుర్తు చేయకపోతే.. సెంచరీ కొట్టేవాడినేమో : రిషబ్ పంత్

praveen
2020- 21 ఎడిషన్ లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా వేదికగా ఆడింది టీమిండియా. ఇక ఈ సిరీస్లో భాగంగా టీమిండియా సాధించిన అద్భుతమైన విజయం ఎప్పటికి భారత ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది అని చెప్పాలి. మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెలవులపై ఇంటికి వెళ్లిన సమయంలో అటు కేవలం యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. వీరోచిత  పోరాటం చేసి గెలిచింది. ఇకపోతే ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన టెస్టు సిరీస్ లో యువ ఆటగాడు రిషబ్ పంత్ సెంచరీ మిస్ చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు పుజారా సెంచరీ గురించి గుర్తు చేయకపోతే తప్పకుండా సెంచరీ కొట్టే వాడినేమో అంటూ చెప్పుకొచ్చాడు.

 బోర్డర్ గవాస్కర్ ట్రోఫి కి సంబంధించి బంధన్ మే థా దమ్  అనే డాక్యుమెంటరీ సిరీస్ సిద్ధం చేయగా ఇందులో ఇక రిషబ్ పంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పుజారా నాతో  కలిసి మరోవైపు క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో ఇక నేను జోరుగా ఆడుతూ ఉండడం  చూసి నా దగ్గరికి వచ్చిన పుజారా ఒక సలహా ఇచ్చాడు. రిషబ్ పంత్ కాసేపు క్రీజులో నిలబడు.. సింగిల్స్ డబుల్స్ కూడా చేయవచ్చు.. ఇక అన్ని బంతులను  బౌండరీ  కొట్టాల్సిన పనిలేదు అంటూ చెప్పాడు. అయితే పుజారా చెప్పిన మాటలకు నాకు కాస్త కోపం వచ్చింది. ఎందుకంటే నేను ఎలా ఆడుతున్నాను అన్న విషయంపై నాకు ఒక స్పష్టత ఉంది.

 పూజారి అలా చెప్పడం తో నా బుర్ర రెండు రకాలు గా ఆలోచించడం మొదలు పెట్టింది. దీంతో తర్వాత కాసేపటికే వికెట్ కోల్పోయాను. పూజారా అలా చెప్పకు పోయి ఉంటే తప్పకుండా 100 పరుగులు కొట్టేవాడిని..  ఇక ఆ మ్యాచ్లో సెంచరీ చేసి ఉంటే చిరస్మరణీయంగా మిగిలిపోయింది అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. అయితే పుజారా జాగ్రత్తగా ఆడు అని సూచించడానికి కూడా కారణం లేకపోలేదు. 97 పరుగుల ఆడుతున్న రిషబ్ పంత్ కాస్త జాగ్రత్తగా అయితే వంద పరుగులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది అని ఆలోచన చేసాడు పూజారా.. కాని దురదృష్టవశాత్తు సెంచరీ చేయకుండానే  వెనుతిరిగా. అయితే పుజారా 97 పరుగుల వద్ద ఉన్నావ్.. జాగ్రత్త ఆడు అని గుర్తు చేసిన విషయం అప్పటివరకు తనకు తెలియదు రిషబ్ పంత్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: