ధోని vs గంభీర్.. 2011 లో ఎవరి ఇన్నింగ్స్ కీలకం?

praveen
ఏప్రిల్ 2, 2011 భారత క్రికెట్ ప్రేక్షకులందరూ మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టు వరల్డ్ కప్ ను ముద్దాడిన రోజు. ఇక ఇండియా లిస్ట్ ద వరల్డ్ కప్ టు రవి శాస్త్రి చెప్పిన మాటలు ఇప్పటికే అటు భారత క్రికెట్ ప్రేక్షకులకు ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటారు అని చెప్పాలి.  28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ భారత జట్టు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో విశ్వవిజేతగా నిలిచింది.  శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అదరగొట్టింది ధోనీసేన.  అయితే ఇక ఈ ప్రపంచ కప్ సాధించిన 11 ఏళ్లు పూర్తయ్యాయి అయినా కొందరు అభిమానులు ఈ ఫైనల్ కు చెందిన ఒక విషయంలో ఇప్పటికీ చర్చించుకుంటూ నే ఉంటారు.

 ప్రపంచ కప్ ఫైనల్ లో గౌతం గంభీర్ ఇన్నింగ్స్ గొప్పదా లేక పోతే కెప్టెన్ మహేంద్రసింగ్ ఇన్నింగ్స్ గొప్పదా అని చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. 122 బంతుల్లో 92 పరుగులు చేశాడు గౌతమ్ గంభీర్.. ఇక చివర్లో 79 బంతుల్లో 91 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు మహేంద్రసింగ్ ధోని. ఇద్దరిలో ఎవరు ఇన్నింగ్స్ గొప్ప అనే చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది.  ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ ఇటీవలే ఎవరి ఇన్నింగ్స్ గొప్ప అన్నదానిపై ఒక పోలింగ్ పెట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టగా అది కాస్త వైరల్ గా మారిపోయింది.

 అయితే 2011 ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో కీలక ఆటగాళ్లు వికెట్ కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో యువరాజ్ సింగ్ స్థానంలో ముందుగా బ్యాటింగ్కు వచ్చాడు మహేంద్రసింగ్ ధోని. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఆ తర్వాత మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. అదే సమయంలో 97 పరుగుల చేసిన గౌతం గంభీర్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించి పోలింగ్ జరగ్గా.. నేటిజన్లు కూడా బాగానే స్పందించారు.  ఇద్దరి ఇన్నింగ్స్ కీలకమని ఇద్దరిలో ఎవరు ఆడకపోయినా టీమిండియా విజయం సాధించేది కాదు అంటూ కామెంట్ చేయడం గమనార్హం. మరికొంతమంది గంభీర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు తీవ్ర ఒత్తిడి ఉందని అలాంటి ఒత్తిడిలో  కూడా పరుగులు చేశాడంటే అతనిని కీలకం అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: