పదో తరగతి పరీక్ష రాశాడు.. అంతలో ప్రాణం పోయింది?

praveen
మనిషి ప్రాణాలకు అసలు గ్యారెంటీ లేదు. కానీ 100 ఏళ్ళు బ్రతుకుతామని..  రేపటి రోజు బాగుంటుంది అనే చిన్న ఆశతోనే ప్రతి రోజూ మనిషి బ్రతుకుతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. కాని కొన్నిసార్లు మాత్రం అనుకోని విధంగా చిన్నవయసులోనే నిండు నూరేళ్లు నిండిపోతు ఉంటాయి. ఊహించని ఘటనలు ప్రాణాలు తీసేస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి విషాదకర ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. పరీక్షల కోసం ఎంతగానో సన్నద్ధం అయ్యాడు.

 మంచి ర్యాంక్ సాధించి ఇక పెద్ద చదువులు చదవాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అతని విషయంలో చిన్నచూపు చూసింది. చివరికి ఊహించని విధంగా అతను మృత్యుఒడిలోకి వెళ్ళిపోయాడు. పదవ తరగతి పరీక్ష రాసి ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తున్న విద్యార్థి మార్గమధ్యంలోనే హఠాత్ మరణం చెందాడు. దాహం వేయడం తో నీరు తాగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా అస్మాయిల్ ఖాన్ పేట్ లో జరిగింది. ఇస్మాయిల్ఖాన్పేట్ కు చెందిన శ్రీనివాస్ అనే 17 ఏళ్ల బాలుడు అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.

 ఇక ఇటీవల సంగారెడ్డిలో పదవతరగతి పరీక్షలు రాశాడు సదరు బాలుడు. ఈ రోజు పరీక్ష బాగా రాశాను అంటూ ఎంతో సంతోషంగా మిత్రులతో కలిసి ఇంటికి వెళ్తున్నాడు. దాహం గా ఉండడంతో మార్గమధ్యంలోనే ఒక దుకాణంలో నీరు కొనుగోలు చేసి తాగాడు. ఇక అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇక స్థానికులు గమనించి వెంటనే ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఎండలో తిరిగి వెంటనే నీళ్లు తాగడం వల్ల వడదెబ్బతో శ్రీనివాస్ మృతి చెంది ఉంటాడని అందరూ భావిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: