ముంబై తో మ్యాచ్.. మమ్మల్ని దురదృష్టం వెంటాడింది : చెన్నై కోచ్
జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు అందరూ కూడా తక్కువ సమయంలో వికెట్లు కోల్పోయారు. అయితే ఇక ఇలా బ్యాట్స్మెన్లూ వికెట్ కోల్పోయిన సమయంలో అటు తమ వికెట్ పై అనుమానాలు ఉన్నప్పటికీ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేయలేకపోయారు. దీనికి కారణం ఆ సమయంలో డిఆర్ఎస్ అందుబాటులో లేకపోవడమే. కరెంట్ పోవడానికి కారణం గా ఇక్కడ డిఆర్ఎస్ అందుబాటులో లేకపోవడంతో చివరికి ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తుది నిర్ణయం గా మారిపోయింది. దీంతో ఎంతో నిరాశతో వెనుదిరిగారు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లు.. ఒకవేళ డిఆర్ఎస్ అందుబాటులో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు.
ఇక ఇటీవల ఇదే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబైలో జరిగిన మ్యాచ్లో చెన్నయ్ ఆరంభంలో డిఆర్ఎస్ అందుబాటులో లేకపోవడంతో దురదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్. మేం వికెట్లు కోల్పోయిన సమయంలో డిఆర్ఎస్ అందుబాటులో ఉండి ఉంటే బాగుండేది. లేకపోవడం ఎంతగానో మమ్మల్ని నిరాశకు గురిచేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటివన్నీ ఆటలో సహజమే అంటూ తెలిపాడు. డిఆర్ఎస్ లేకపోవడం వల్ల మేము వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. పరిస్థితులను ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఏదేమైనా మేము మరింత బాగా ఆడాల్సింది అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ చెప్పుకొచ్చాడు..