ముంబై ఇండియన్స్ నుండి ఈ జట్లకు దెబ్బే?
దీనితో టైటిల్ కు పొతే పడే 10 జట్ల నుండి తొమ్మిదికి తగ్గింది. అయితే ఇప్పుడు ఒక వైరల్ గా మారుతోంది. మాములుగా ఒక టీమ్ లీగ్ నుండి నిష్క్రమించాల్సి వస్తే..ఆ జట్టు తదుపరి గెలిచే లేదా ఓడిపోయే మ్యాచ్ లు ప్లే ఆఫ్ అవకాశాలున్న మిగిలిన జట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది ప్రతిసారి జరిగేదే అయినప్పటికీ ఇలా ఛాంపియన్ అయ్యే లక్షణాలు ఉన్న జట్టు వెళ్లిపోవడం ఫ్యాన్స్ ను తీవ్రంగా కలచివేస్తోంది. అయితే ఈ సారి ముంబై ఇండియన్స్ ఏ ఏ జట్లను ప్లే ఆప్స్ కు వెళ్లకుండా దెబ్బ తీస్తుందో అన్నది తెలియాలంటే ముంబై ఆడే మ్యాచ్ లపై ఒక లుక్ వేయాల్సిందే.
ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ , కోల్కతా నైట్ రైడర్స్ , చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లు ఆడనుంది. కాగా ఇప్పటికే గుజరాత్ ప్లే ఆప్స్ కు అర్హత సాధించింది. కాబట్టి పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న చెన్నై, కోల్కతా మరియు ఢిల్లీ ల పై ప్రభావం పడనుంది.