కేఎల్ రాహుల్ కి అసలు పరీక్ష మొదలైంది. ఏం చేస్తాడో?

praveen
ప్రస్తుతం అందరి దృష్టి టీమిండియా ఆడుతున్న వన్డే సిరీస్ పైన ఉంది ఇప్పటికే భారీ అంచనాల మధ్య టెస్టు సిరీస్లో బరిలోకి దిగిన టీమిండియా చివరికి సౌతాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసింది. దీంతో సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించాలన్న  కల కలగానే మిగిలిపోయింది. అయితే టెస్టు సిరీస్లో ఓడిపోవడంతో ఇక ఇప్పుడు వన్డే సిరీస్ లో అయినా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక ప్రస్తుతం విరాట్ కోహ్లీ కేవలం ఒక సాదాసీదా ఆటగాడిగా కొనసాగుతుండగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియాకు దూరమయ్యాడు. అదేసమయంలో యువ ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుతం టీమిండియా ని ముందుకు నడిపిస్తూ ఉండటం గమనార్హం.

 ఈ క్రమంలోనే ఇటీవలే టీమిండియా పేలవ ప్రదర్శన చేసి ఏకంగా 31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో మొదటి వన్డే మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కాగా ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు రెండవ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇక రెండో వన్డే మ్యాచ్లో గెలిచి సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది టీమిండియా. ఇక ఈ రెండవ వన్డే  మ్యాచ్లో విజయం అటు కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీకి అసలు పరీక్ష గా మారబోతుంది.. రెండో వన్డే మ్యాచ్లో కె.ఎల్.రాహుల్  ఎలాంటి వ్యూహాలతో  బరిలోకి దిగుతాడు అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే జట్టు లో ఎలాంటి మార్పులు లేకుండానే రెండో మ్యాచ్లో కూడా టీమిండియా బరిలోకి దిగబోతోంది అని తెలుస్తోంది.

 కాగా ఆల్ రౌండర్ గా ఉన్న వెంకటేష్ అయ్యర్ ని జట్టులోకి తీసుకున్న అయ్యర్ అతనితో బౌలింగ్ చేయించక పోవడం తో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. బౌలింగ్ చేయించే  ఉద్దేశం లేనప్పుడు రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లను  తీసుకుంటే సరిపోయేది అంటూ మాజీ క్రికెటర్లు విమర్శలు చేశారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా లాంటి వారు లేకపోవడంతో ఇక మిడిలార్డర్ ఎంతో బలహీనంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కెప్టెన్గా కె.ఎల్.రాహుల్ ఎలాంటి మ్యాజిక్ చేసి టీమిండియాకు విజయం అందించబోతున్నాడు అన్న దానిపైన అందరి దృష్టి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: