టీమిండియాలోకి అతనొచ్చాడంటే.. ఇక తిరుగుండదు?

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియాకు మిడిలార్డర్ సమస్య ఎంతగానో వేధిస్తోంది. అటు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చినప్పటికీ మిడిలార్డర్లో ఐదవ స్థానంలో క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోతున్నారు. ఎంత మంది ఆటగాళ్లను మార్చిన ఎవరు కూడా మిడిలార్డర్ స్థానానికి సరైన న్యాయం చేయలేక పోతున్నారు. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి మిడిలార్డర్ సమస్య టీమిండియాకు ఎంతో మైనస్ గా మారిపోతుంది. ఎన్నిసార్లు మిడిలార్డర్లో ఆటగాళ్లను మార్పులు చేసిన ఫలితం మాత్రం లేకుండా పోతుంది.

 ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్ ఇండియా ఆడిన మొదటి వన్డే మ్యాచ్లో టాపార్డర్ లోని బ్యాట్స్మెన్లు బాగా రాణించినప్పటికీ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయారూ. తక్కువ స్కోరుకే పరిమితం కావడంతో చివరికి టీమిండియా ఓటమి పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇటీవలే జట్టులో స్థానం దక్కించుకున్న వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తాడు అని అనుకున్నప్పటికీ పేలవ ప్రదర్శన చేయడంతో మరోసారి మిడిలార్డర్ కి సంబంధించిన చర్చ తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.

 ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇటీవలే స్పందించాడు. టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ నూ జట్టులోకి తీసుకుంటే మిడిలార్డర్ సమస్యకు పరిష్కారం దొరికినట్లే.. అంతేకాకుండా జట్టు కూర్పులో స్వల్ప మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించడం వన్డే మ్యాచ్లలో ఎంతో కష్టం ఎవరో ఒకరు తప్పనిసరిగా బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. శిఖర్ ధావన్, కోహ్లీ రూపంలో టీమిండియాకు మెరుగైన ఆరంభం దక్కినప్పటికీ ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోవడంతో భారత్ మ్యాచ్ పై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రేకర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: