షాకింగ్ న్యూస్: ఐసీసీ టీ 20 జట్టులో భారత్ ఆటగాళ్లకు దక్కని చోటు...

VAMSI

భారత్ జట్టులో రోజు రోజుకీ పలు సమస్యలు బయటపడుతున్నాయి. ఒకప్పుడు లోపల ఎన్ని సమస్యలు ఉన్న ఆటతీరులో తేడా ఉండేది కాదు. మంచి ప్రదర్శన కనబరుస్తూ మూడు ఫార్మాట్ లలోనూ తిరుగులేని విజయాలు సాధిస్తూ నెంబర్ వన్ జట్టుగా కొనసాగింది. అయితే గత రెండు సంవత్సరాలుగా కారణాలు ఏమైనప్పటికీ ఇండియా మూడు ఫార్మాట్ లలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే చేయడం లేదు. ధోని కెప్టెన్ గా ఉండగా జట్టు తీరు అభినందనీయంగా ఉండేది. ఆ తర్వాత కోహ్లీ కూడా టెస్ట్ లలో జట్టును బాగా తీర్చిదిద్దాడు. అయితే ఇటీవలే కోహ్లీ అన్ని ఫార్మాట్ ల నుండి కెప్టెన్ గా తప్పుకోవడంతో జట్టులోని డొల్ల అంతా బయటపడుతోంది.
దానికి తోడు గత సంవత్సరం యూఏఈ వేదికగా జరిగిన టీ 20 ప్రపంచ కప్ లో భారత్ కనీసం లీగ్ స్టేజ్ ను దాటకపోవడం చాలా దురదృష్టకరం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐసీసీ ప్రకటించిన బెస్ట్ వరల్డ్ టీ 20 టీమ్ లో ఒక్క ఇండియన్ ఆటగాడు కూడా లేకపోవడం బాధాకరం. ప్రతి సంవత్సరం ఐసీసీ సెలెక్ట్ చేసే ఈ జట్టులో భారత్ నుండి కనీసం ఇద్దరు అయినా చోటును దక్కించుకునే వారు. కానీ 2021 సంవత్సరం లో భారత్ ఆటగాళ్ల ప్రదర్శన ఐసీసీ ని మెప్పించలేకపోయింది. అందుకే ఒక్కరు కూడా ఈ జట్టులో స్థానం సంపాదించలేకపోయారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  
ఇక ఈ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లను చూస్తే, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఈ జట్టుకు కెప్టెన్ గా ఎంపిక కావడం విశేషం. మిగిలిన వారిలో మహమ్మద్ రిజ్వాన్, జొస్ బట్లర్, మార్ క్రామ్, మిచెల్ మార్ష్, డేవిడ్ మిల్లర్, హాసరంగా, శంసి, హాజిల్ వుడ్, ముస్తాఫిజర్ రెహ్మాన్ మరియు షహీన్ ఆఫ్రిది లు ఉన్నారు. పాక్ నుండి ముగ్గురు, సౌత్ ఆఫ్రికా నుండి ముగ్గురు, ఆస్ట్రేలియా నుండి ఇద్దరు, ఇంగ్లాండ్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ ల నుండి ఒక్కో ప్లేయర్ కి చోటు లభించింది. దీనితో ఇండియాకు ఐసీసీ పెద్ద షాక్ ఇచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: