విరాట్‌ కోహ్లీ వారుసుడిగా బుమ్రా ?

Veldandi Saikiran

గత శనివారం సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత... విరాట్ కోహ్లీ భారత టెస్ట్ జట్టు కెప్టెన్ గా తప్పుకుంటాను అని ప్రకటించింది అని తెలిసిందే. దాంతో కోహ్లీ తర్వాత ఎవరు కాబోయే టెస్ట్ కెప్టెన్ అనే విషయంలో చర్చ మొదలయింది. కానీ... రోహిత్ శర్మనే టెస్ట్ కెప్టెన్ గా అవుతాడు అని చాలా మంది అంటున్న... ఆ రేస్ లో కేఎల్ రాహుల్, పంత్ తో పాటుగా జస్‌ప్రీత్ బుమ్రా పేరు కూడా ఉంది. అయితే తాజాగా... టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని బుమ్రా ప్రకటించాడు. సారథ్య బాధ్యతలు అప్పగిస్తే గొప్ప గౌరవంగా భావిస్తానని చెప్పాడు. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో సౌతాఫ్రికా పర్యటనకు దూరమవడంతో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్ గా ఉండగా.. బుమ్రా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్ నేపథ్యంలో తాజాగా మాట్లాడిన బుమ్రాను టెస్ట్ కెప్టెన్సీపై తన స్పందన తెలిపాడు.
బుమ్రా మాట్లాడుతూ... నాకు తెలిసి ఏ ప్లేయర్‌ కూడా కెప్టెన్సీ అవకాశం వస్తే వద్దని చెప్పడు. నేను కూడా అంతే. కెప్టెన్‌గా నా శక్తిసామర్థ్యాల మేరకు జట్టుకు సహకారం అందిస్తా. కెప్టెన్సీ ఇవ్వకపోయినా ఆటగాడిగా నా సామర్థ్యం కోసం కృషి చేస్తా. బాగా రాణించడంపైనే నా దృష్టి ఉంటుంది. వన్డే సిరీస్‌ లో వైస్ కెప్టెన్‌ గా బాధ్యతలు స్వీకరించడం, సహచర ఆటగాళ్లకు అండగా ఉండటం నాకు సహజంగానే వస్తుంది. ప్రస్తుత పరిస్థితిని నేను అదే పద్ధతిలో చూస్తున్నాను. వైస్ కెప్టెన్‌గా బాధ్యత వహించడం, ఆటగాళ్లతో మాట్లాడటం, వారికి సహాయం చేయడం అన్నీ ఒకే విధంగా చూస్తాను.'అని బుమ్రా తెలిపాడు. అలాగే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే విషయాన్ని కోహ్లీ తమకు ముందే తెలియజేశాడని బుమ్రా అన్నారు. అప్పుడు జట్టు సభ్యులు అందరూ... అతని నిర్ణయాన్ని గౌరవిస్తు... కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన ఘనతలకు అభినందించామని బుమ్రా పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: