రోహిత్ ఇలా మారాడేంటి.. కొత్త లుక్ వైరల్?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో సీనియర్ ప్లేయర్గా, స్టార్ ఆటగాడు గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ సిక్సర్ల వీరుడిగా, డబుల్ సెంచరీల దీరుడిగా  దూసుకు పోతున్నాడు. ఇక ప్రతి మ్యాచ్లో కూడా ఓపెనర్గా బరిలోకి దిగి టీమిండియా కు భారీ స్కోర్లు అందించడంలో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఎప్పుడూ అద్భుతంగా రాణిస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు. ఇక ఎన్నో రికార్డులు కొల్లగొడుతూ ఉంటాడు రోహిత్ శర్మ. ఇకపోతే మొన్నటి వరకు జట్టులో స్టార్ ఓపెనర్ గా కొనసాగిన రోహిత్ శర్మ ఇటీవల కెప్టెన్గా ప్రమోషన్ కూడా అందుకున్నాడు.

 మొదట టీ-20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత వన్డే జట్టుకు కెప్టెన్గా కూడా మారిపోయాడు. మరోవైపు టెస్టు జట్టుకి వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపిక అయ్యాడు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు గాయం కారణంగా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగుళూరులో నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఫిట్నెస్  ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అదేసమయంలో ప్రస్తుతం ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి గడుపుతూ ఎంతగానో ఆస్వాదిస్తున్నాడు రోహిత్ శర్మ. ఇకపోతే ఇటీవల రోహిత్ శర్మ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

 అయితే ఈ ఫోటోలు చూసి ఒక్క సారిగా అభిమానులు అందరూ షాక్ అయి పోతున్నారు. ఎందుకంటే ఈ ఫోటోలలో రోహిత్ శర్మ న్యూ లుక్ తో కనిపిస్తున్నాడు. పూర్తిగా గడ్డం మీసాలు తీసేసి క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు రోహిత్ శర్మ. ఇక అదే సమయంలో తన భార్యతో కలిసి దిగిన ఒక ఫోటో ని కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ ఫోటో చూసి మొదట ఆశ్చర్యపోయిన అభిమానులు హిట్ మాన్ ఎంతో యంగ్ గా కనిపిస్తున్నాడు అంటూ ఈ ఫోటోకి కామెంట్ లు పెడుతూ ఉండటం గమనార్హం. ఇక రోహిత్ శర్మ ఈ ఫోటో పోస్టు చేసాడో లేదో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: