అయ్యో పంత్.. బ్యాట్ జారింది.. జోక్ పేలింది?

praveen
మొన్నటి వరకు రెండో టెస్ట్ మ్యాచ్లో పేలవమైన ఫామ్ తో నిరాశపరిచిన రిషబ్ పంత్ మూడవ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.. ఏకంగా సౌత్ ఆఫ్రికా బౌలర్లతో ఒక ఆట ఆడుకునీ సెంచరీ సాధించాడు రిషబ్ పంత్. ధనాధన్ ఫటాఫట్ ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన రిషబ్ పంత్ పేరు వినిపిస్తోంది. అదే సమయంలో ఇక ఇటీవలే రిషబ్ పంత్ కు సంబంధించి ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తక్కువ సమయంలోనే ఫేమస్ క్రికెటర్ గా ఎదిగిన రిషబ్ పంత్ వాణిజ్య ప్రకటనల్లో కూడా కనిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఒక స్టీల్ కంపెనీ యాడ్ లో కనిపించాడు రిషబ్ పంత్. ఈ ప్రకటనలో భాగంగా బ్యాట్ పట్టు గురించి రిషబ్ పంత్ కి కౌంటర్ వేసే విధంగా ఒక డైలాగ్ ఉంటుంది. ఇక ఈ యాడ్ అప్పట్లో ఎంతగానో ఆకర్షించింది. కొంతమందికి నవ్వు కూడా మెప్పించింది. ఇక ఇప్పుడు ఇదే జోకు అటు నిజమైన క్రికెట్లో కూడా పేలింది. ఇటీవలే రిషబ్ పంత్ ని ఎంతో దూకుడుగా ఆడుతున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బంతిని బలంగా కొట్టే క్రమంలో రిషబ్ పంత్ చేతి నుంచి బ్యాట్ జారిపోయి అల్లంత దూరం లో పడిపోయింది. అయితే అచ్చం వాణిజ్య ప్రకటనల్లో పడినట్లు గానే ఇక్కడ క్రికెట్లో కూడా బ్యాట్ జారిపోవడం తో రిషబ్ పంత్ పై అందరు ఫన్నీగా కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

 పంత్ దూకుడుగా ఆడుతూ వరుస బౌండరీలతో విజృంభిస్తున్న సమయంలో సరైన బంతి దొరికితే చాలు దానినీ బౌండరీకి తరలిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓలివర్ వేసిన బంతిని ఆఫ్ సైడ్ బౌండరీకి తరలించెందుకు ప్రయత్నించాడు. బంతిని గట్టిగా కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే అనుకున్నట్లుగా బంతి బౌండరీ వెళ్ళింది. కానీ పంత్ చేతిలో ఉన్న బ్యాట్ జారీ 30 అడుగుల వద్ద పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు. దీంతో ఏం జరిగిందో కాసేపు అర్థం కాకుండా షాక్ అయిన పంత్ తర్వాత తేరుకుని నవ్వుకుంటూ బ్యాట్ తెచ్చుకున్నాడు. బ్యాట్ ఇలా జారిపోవడం తో ఒకప్పుడు ప్రకటనలో డైలాగ్ ని ఇక ఇప్పుడు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bat

సంబంధిత వార్తలు: