ఇండియాలో కాదు, యూఏఈలో కాదు.. ఐపీఎల్ ఎక్కడంటే?

praveen
2022 ఐపీఎల్ సీజన్ కోసం ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ఉండబోతుంది. ఎందుకంటే మెగా వేలం నిర్వహించడం కారణంగా ఏ జట్టులోకి ఏ ఆటగాడు వెళ్ళపోతున్నాడు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. అదే సమయంలో ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లూ ఎంట్రీ ఇస్తున్నాయి. దీంతో ఐపీఎల్ పోరు రసవత్తరంగా మారబోతుంది. దీంతో ఇక ఈ ఐపీఎల్ సీజన్  సరికొత్తగా ఉండబోతోందని ప్రేక్షకుల బలంగా నమ్ముతున్నారు. ఐపీఎల్కు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఒకప్పటిలా యూఏఈ వేదికగా కాకుండా ఇక భారత్ వేదికగానే బీసీసీఐ ఐపీఎల్ 2022 సీజన్ నిర్వహించాలని భావించింది అన్న విషయం తెలిసిందే.

 కానీ ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ కేసులు పెరిగి పోతూ ఉండటం చూస్తూ ఉంటే ఇక రానున్న రోజుల్లో భారత్ లో ఐపీఎల్ నిర్వహించడం కష్టతరం అయ్యే అవకాశం ఉంది అని ఎంతో మంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకవేళ ఇండియాలో  కుదరకపోతే ఎప్పటిలాగానే యూఏఈ వేదికగా బిసిసిఐ ఐపీఎల్ నిర్వహించబోతోంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా మరో రెండు వేదికలు తెర మీదికి రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో అసలు ఐపిఎల్ ఎక్కడ నిర్వహించబోతున్నారు అన్న చర్చ మొదలయింది.

 అయితే మునుపటిలా యూఏఈ వేదికగా కాకుండా ఈసారి దక్షిణాఫ్రికా లేదా శ్రీలంక వేదికగా ఐపీఎల్ 2022 సీజన్ నిర్వహించే అవకాశం ఉంది అని ఇక ఈ రెండు వేదికలను కూడా పరిశీలిస్తున్నామని అంటూ ఇటీవల బీసీసీఐ అధికారి  ఒకరు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతిసారీ ఐపీఎల్ను యూఏఈలో నిర్వహించడం కుదరక పోవచ్చు. అందుకే ఇతర దేశాల్లో పరిస్థితులపై కూడా బిసిసీఐ అధ్యయనం చేస్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. భారత్ లోనే ఐపీఎల్ నిర్వహించాలని ముందుగా బిసిసిఐ భావించినప్పటికీ.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య.. ఇక ఇతర దేశాలలో వేదికలపై కూడా బిసిసిఐ దృష్టిసారిస్తోంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: