రిషబ్ పంత్ షాకింగ్ రికార్డు.. అతనొక్కడే?

praveen
టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న వికెట్ కీపర్ రిషబ్  పంత్ గత కొంత కాలం నుంచి పేలవా ఫామ్ లో కొనసాగుతూ ఉండడం మాత్రం టీమిండియా అభిమానులందరినీ కూడా నిరాశలో ముంచెత్తింది. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ భారీగా పరుగులు చేసి టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర వహిస్తాడు అనుకున్న రిషబ్ పంత్ తక్కువ పరుగులు చేసి వికెట్ చేజార్చుకుంటూ ఉండటం ఎంతోమంది అభిమానుల ఆగ్రహాన్ని తెప్పించింది. ఈక్రమంలోనే రిషబ్ పంత్ ను జట్టు నుంచి తప్పించి మరో ఆటగాడికి అవకాశం కల్పించాలంటూ డిమాండ్లు కూడా ఎక్కువైపోయాయి. రిషబ్ పంత్ పేలవమైన ఫాం జట్టుకు మైనస్ గా మారిపోతుంది అంటూ ఎంతోమంది విమర్శలు కూడా చేశారు.

 అయితే రిషబ్ పంత్ తప్పించాలి అంటూ ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ అతనికి మద్దతుగా నిలిచాడు కెప్టెన్ కోహ్లి. రిషబ్ పంత్ కి కాస్త సమయం ఇస్తే తిరిగి మళ్ళీ కుదురుకొని బాగా రాణిస్తాడు అంటూ ధీమా వ్యక్తం చేశాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కెప్టెన్ కోహ్లి నమ్మకాన్ని నిలబెడుతూ రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటి వరకూ పేలవమైన ఫామ్ కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా రిషబ్ పంత్ తనపై విమర్శలు చేసిన అందరికీ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. ధనా ధన్ ఫటా ఫట్ అనే రేంజ్ లో తన ఆటను కొనసాగించి సౌత్ ఆఫ్రికా బౌలర్లు అందరికీ కూడా చుక్కలు చూపించాడు రిషబ్ పంత్.

 ఇక ఇటీవలే సాధించిన సెంచరీతో రిషబ్ పంత్ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.. ఆసియా బయట మూడు సెంచరీలు చేసిన ఏకైక భారత వికెట్ కీపర్ గా నిలిచాడు రిషబ్ పంత్. ఇక ఇప్పటి వరకు ఆసియా బయట సెంచరీ చేసిన భారత వికెట్ కీపర్లు ఎవరో తెలుసుకుందాం. సంజయ్ మంజ్రేకర్ వెస్టిండీస్ పై  118 చేశాడు. రాత్ర వెస్టిండీస్ పైనే 115 పరుగుల తో రాణించాడు. వృద్ధిమాన్ సాహా 104 పరుగులతో వెస్టిండీస్ పై 2016లో సెంచరీ చేశాడు.  ఇక ఆ తర్వాత రిషబ్ పంత్ 2018 లో 114 ఇంగ్లాండ్పై, 2019లో ఆస్ట్రేలియా పై 159 పరుగులు, 2022 లో సౌత్ఆఫ్రికాపై 100 పరుగులు చేసి మూడు సార్లుసెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: