స్టన్నింగ్ క్యాచ్.. వామ్మో.. ఇదేం ఫీల్డింగ్?

praveen
ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సంఘటనలు ప్రేక్షకులను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మైదానంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే ఫీల్డర్లు చేసే ఆశ్చర్యకరమైన ఫీల్డింగ్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా మైదానంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లు సిక్సర్ వెళ్తుంది అనుకున్న బంతిని ఒడిసి పట్టుకొని వికెట్ తీయడం లాంటివి చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా ఇలా అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తున్న కొన్ని వీడియోలు ఇప్పటికే వైరల్ గా మారిపోయాయ్.

 ఇక ఇప్పుడు మూడవ టెస్ట్ లో కూడా ఇలాంటి ఒక అద్భుతమే జరిగింది. అదిరిపోయే క్యాచ్ సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోతుంది. మైదానంలో ఏకంగా స్పైడర్ మాన్ లాగా గాల్లోకి ఎగిరిన ఆటగాడు బంతిని ఒంటిచేత్తో పట్టుకుని అదరగొట్టాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు కీగన్ పీటర్సన్  ఈ అద్భుతమైన క్యాష్ పట్టుకుని ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇక రెప్పపాటుకాలంలో గాల్లోకి ఎగిరి పీటర్సన్ పట్టుకున్న క్యాచ్ చూసి ప్రేక్షకులు అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

 ఇటీవలే క్రీజులోకి వచ్చిన చటేశ్వర్ పుజారా  అద్భుతంగా రాణిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అనుకోని విధంగా ఒకే ఒక్క పరుగు చేసి చివరికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మూడో రోజు తొలి ఓవర్ రెండో బంతికే మార్కో జాన్సన్ బౌలింగ్లో పుజారా వికెట్ చేజార్చుకోవటం గమనార్హం. మార్కో జాన్సన్ వేసిన బంతి పూజారా బ్యాట్ ఏడ్జ్ కు తగిలి గ్యాప్ లోకి వెళ్ళింది. దీంతో ఎవరు పట్టుకోకపోతే బౌండరీ వైపు దూసుకు పోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అంతలోనే కీగన్ పీటర్సన్ ఏకంగా స్పైడర్ మాన్ లాగ గాల్లోకి ఎగిరాడు. రెప్పపాటుకాలంలో ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన పుజారా చివరికి నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: