కోహ్లీ ఇగో వదిలేసాడు : గంభీర్

praveen
ఇటీవలే కేప్ టౌన్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్ట్ మ్యాచ్లో రెండు జట్లు కూడా హోరాహోరీగా తలపడుతూ ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికే జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఇరు జట్లు చెరో విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇక విజేతను నిర్ణయించే మ్యాచ్ గా మారిపోయింది మూడవ టెస్ట్ మ్యాచ్. మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించాలని టీమిండియా ప్రయత్నాలు చేస్తూ ఉంటే తమ విజయపరంపర కొనసాగించాలని అటు సౌత్ ఆఫ్రికా జట్టు బరిలోకి దిగింది.

 ఇక జనవరి 11వ తేదీన కేప్ టౌన్ వేదికగా ప్రారంభమైంది మూడవ టెస్ట్ మ్యాచ్. ఇక ఇందులో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న విరాట్ కోహ్లీ పూర్తిస్థాయి ఫిట్నెస్తో మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక విరాట్ కోహ్లీ మూడో టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేయడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అయితే అటు భారత బ్యాటింగ్ విభాగం మొత్తం కుప్పకూలి పోతున్న వేళ విరాట్ కోహ్లీ ఎంతో బలంగా నిలబడ్డాడు. ఎక్కడా పొరపాటు చేయకుండా భారీ పరుగులు చేశాడు.

 ఇక ఒకానొక దశలో విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఖాయం అనుకుంటున్న సమయంలో 79 పరుగుల వద్ద  వికెట్ చేజార్చుకున్నాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం జట్టుకు ఎంతో ప్లస్ పాయింట్ గా మారిపోయింది. ఇక  విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పై ప్రస్తుతం ఎంతో మంది మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్ళేముందు ఆటగాళ్లు తమ అహాన్ని వదిలేసి వెళ్లాలని విరాట్ కోహ్లీ ఇంతకుముందే పలుమార్లు చెప్పాడు. ఇటీవలే మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ అహాన్ని వదిలేసి ఆడాడు.  సహచర ఆటగాళ్లు నుంచి సహకారం అందకున్నా క్రమశిక్షణతో బ్యాటింగ్ చేశాడు. బలహీనతను అధిగమిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అంటూ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: