ఐపీఎల్ 2022.. మొత్తం మ్యాచులు అక్కడే నట?

praveen
ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులకు అందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఉత్కంఠభరితంగా  జరిగే ప్రతి మ్యాచులను వీక్షించేందుకు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఒకప్పుడు స్టేడియం కు వెళ్లి మ్యాచ్ లను లైవ్ లో వీక్షించే వారు ప్రేక్షకులు. కానీ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ అవకాశమే లేకుండా పోయింది. ఇక గత ఏడాది బీసీసీఐ కఠిన నిబంధనల మధ్య భారత్లోనే ఐపీఎల్ ప్రారంభించింది. దీంతో ప్రేక్షకులకు అనుమతిలేకపోయిన భారత్లో ఐపీఎల్ జరుగుతుందని ప్రేక్షకులు కాస్త సంతోషపడ్డారు.

 కానీ అంతలోనే ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడటంతో చివరికి ఐపీఎల్ వాయిదా పడింది.  ఆ తర్వాత మళ్లీ యూఏఈ వేదికగా మిగతా సగం మ్యాచ్లు నిర్వహించారు. ఇదిలా ఉంటే ఇక ఈసారి ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ డబుల్ కాబోతుంది. ఒకవైపు మెగా వేలం ద్వారా ఎంతో మంది ఆటగాళ్లు కొత్తజట్లలోకి వెళ్లబోతున్నారు. ఇక ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్లు కూడా వస్తూ ఉండడం గమనార్హం. దీంతో ఇక ఈ సీజన్ ఊహకందని  ఎంటర్టైన్మెంట్ అందించబోతుందని క్రికెట్ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు

 ఇలాంటి సమయంలోనే మళ్లీ దేశంలో  వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూ ఉండడంతో ఈసారి ఐపీఎల్ ఎక్కడ జరుగుతుంది అన్న ఆందోళన అందరిలో మొదలయ్యింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో అటు బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.అది ఇప్పటికే భారత్లో ఐపీఎల్ నిర్వహిస్తామని బిసిసీఐ ప్రకటన చేసింది. అయితే మునుపటిలా నాలుగైదు రాష్ట్రాలలో కాకుండా కేవలం ఒకే రాష్ట్రంలో ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తోందట. మహారాష్ట్రలోనే పూర్తి ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అటు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతున్నారట.. ఒకవేళ రానున్న రోజుల్లో ఇది సాధ్యం కాకపోతే మళ్లీ యూఏఈ లోనే ఐపీఎల్ నిర్వహించాల్సి ఉంటుందని బిసిసీఐ వర్గాల నుంచి వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: